Azam Khan : సమాజ్ వాదీ పార్టీ అగ్ర నాయకుడు ఆజం ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. యూనివర్శిటీని సీలింగ్ చేయడంపై మండిపడ్డారు. ఈ మేరకు యూపీ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దావా వేస్తానంటూ ప్రకటించారు.
గురువారం ఆజంఖాన్ మీడియాతో మాట్లాడారు. ఇదే విషయంలో యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందంటూ ఆరోపించారు.
తన యూనివర్శిటీని సీల్ చేసినందుకు కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభంచాలని కోరతానని ఆజంఖాన్(Azam Khan) తెలిపాడు. జౌహర్ యూనివర్శిటీ క్యాంపస్ కు ఆనుకుని ఉన్న భూమిని అటాచ్ చేస్తామని ఖాన్ కు విధించిన బెయిల్ షరతుపై స్టే విధించింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందనను కోరింది. రాంపూర్ లోని యూనివర్శిటీ నుండి యూపీ ప్రభుత్వం ముళ్ల కంచెను తొలగించలేదని, కోర్టు ఆదేశించినా అది సక్రమంగా పని చేయడం లేదని ఆజం ఖాన్ ఆరోపించాడు.
న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్ , జేబీ పార్దివాలా మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్ జూలై 19 లోగా తన స్పందనను దాఖలు చేస్తుందన్నారు.
తదుపరి విచారణకు జూలై 22న కేసును జాబితా చేస్తామన్నారు. గత మే నెల 27న అత్యున్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ ఖాన్ పై విధించిన అలహాబాద్ హైకోర్టు బెయిల్ షరతును నిలిపి వేసింది.
యూనివర్శిటీ క్యాంపస్ కు అనుబంధంగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలని రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఆజం ఖాన్ కు అలహాబాద్ హైకోర్టు విధించిన బెయిల్ షరతు అసమానంగా ఉందని జడ్జీలు చంద్రచూడ్ , ఎం. త్రివేది పేర్కొనడం విశేషం.
Also Read : కేంద్ర సర్కార్ పై టికాయత్ కన్నెర్ర