Delhi CM : సింగ పూర్ సదస్సుకు వెళ్లకుండా అడ్డుపుల్ల
అడ్డు కోవాలని చూస్తన్నారంటూ ఆరోపణ
Delhi CM : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఈసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.
తీవ్ర పదజాలం వాడారు. బిజేపీయేతర ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి వేశారంటూ మండిపడ్డారు.
తాజాగా ఇంకో తీవ్రమైన ఆరోపణ చేశారు కేజ్రీవాల్(Delhi CM) పై. తాను సింగపూర్ లో పర్యటించాల్సి ఉందని కానీ ఈరోజు వరకు తనకు పర్మిషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ దేశంలో నిర్వహించే శిఖారగ్ర సమావేశానికి హాజరు కావాల్సింది.
ఇప్పటికే ఆలస్యమైందని అనుమతి ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. తన టూర్ కు సంబంధించి ఆలస్యం కావడంతో అరవింద్ర కేజ్రీవాల్ ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు.
ఇదిలా ఉండగా సింగపూర్ లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు తాను పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
అయితే ఏ సీఎం అయినా ఇతర దేశాలకు అధికారిక పర్యటన చేయాల్సి వస్తే ముందుగా కేంద్ర సర్కార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంత ముఖ్యమైన వేదికను సందర్శించకుండా సీఎంని ఆపడం దేశ ప్రయోజనాలకు విరుద్దమని పేర్కొన్నారు. ఈ పిలుపు దేశానికి గర్వ కారణమని తెలిపారు.
కేజ్రీవాల్ ను సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ గత జూన్ లో కలిసి రావాలని కోరారు. ఢిల్లీ మోడల్ కావాలని కోరారు. యావత్ ప్రపంచం కోరుకుటుంటోందన్నారు.
Also Read : మోదీకి వ్యతిరేకంగా ‘పటేల్’ కుట్ర – సిట్