Opposition Questions : అఖిల‌ప‌క్ష మీటింగ్ కు మోదీ గైర్హాజ‌ర్

ఎందుకు రాలేదంటూ విప‌క్షాలు ఫైర్

Opposition Questions : పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఈనెల సోమ‌వారం 18 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు భార‌త దేశ అత్యున్న‌త రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి కూడా ఎన్నిక జ‌ర‌గ‌నుంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కోనున్నారు. ఇక ఎప్ప‌టి లాగానే పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు స‌జావుగా సాగేందుకు ప్ర‌ధాన మంత్రి నేతృత్వంలో అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

కానీ ఇవాళ జ‌రిగిన ఆల్ పార్టీ మీటింగ్ కు న‌రేంద్ర మోదీ(PM Modi) గైర్హాజ‌ర‌య్యారు. ఇప్పుడే అనుకుంటే పొర‌పాటు. గ‌తంలో జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి కూడా రాలేదు.

రెండోసారి కూడా ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా ప్ర‌ధాని గైర్హాజ‌ర‌య్యారంటూ ప్ర‌తిప‌క్షాలు నిప్పులు(Opposition Questions) చెరిగాయి. ఈ మేర‌కు ఆల్ పార్టీ మీటింగ్ కు కావాల‌ని హాజ‌రు కావ‌డం లేదంటూ మండిప‌డ్డాయి.

ఇది ప్ర‌జాస్వామ్యానికి పాత‌ర వేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాదంటూ పేర్కొన్నాయి. ఆదివారం పార్లమెంట్ లోని అనెక్స్ లో అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది.

మ‌రి ఇది అన్ పార్ల‌మెంట‌రీ కాదా అనీ కాంగ్రెస్ పార్టీ మీడియా క‌న్వీన‌ర్ జై రాం ర‌మేష్ ప్ర‌శ్నించారు మోదీని. అయితే అధికార ప‌క్షానికి విప‌క్ష ఎంపీలు స‌హ‌క‌రించాల‌ని కోరారు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి.

ఇదిలా ఉండ‌గా అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో జాప్యం, సాయుధ ద‌ళాల కోసం అగ్నిఫ‌త్ భ‌ర్తీ స్కీం, ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, కేంద్రం స‌మాఖ్య నిర్మాణాన్ని దుర్వినియోగం చేయ‌డం వంటి ఇత‌ర స‌మ‌స‌ల్య‌ను కూడా ప్ర‌తిప‌క్షం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Also Read : ర‌హ‌దారులు అభివృద్దికి సోపానాలు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!