Secunderabad Bonalu : అంగ‌రంగ వైభ‌వం బోనాల సంబురం

ఉజ్జ‌యిని మ‌హంకాళి పండుగ స్టార్ట్

Secunderabad Bonalu : తెలంగాణ అంటేనే బోనాల‌కు ప్ర‌సిద్ది. ఊరుమ్మ‌డి సంస్కృతికి ద‌ర్ప‌ణం. న‌గ‌రంలో ఓ వైపు వ‌ర్షాలు కురుస్తున్నా జ‌నం మాత్రం బోనాల సంబురంలో మునిగి పోయారు.

హైద‌రాబాద్ లో అత్యంత ప్ర‌సిద్ధి చెందిన సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి(Secunderabad Bonalu)  అమ్మ వారి బోనాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఆదివారం ఉద‌యం అమ్మ వారికి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేయ‌డంతో బోనాల సంద‌డి మొద‌లైంది.

చిన్నారులు, పిల్ల‌లు, పెద్ద‌లు పెద్ద ఎత్తున బోనాల సంబురంలో పాల్గొన్నారు. న‌గ‌రం మొత్తం అమ్మ వారి ఆశీస్సుల కోసం వేచి ఉన్నది. న‌గ‌ర వాసులే కాకుండా ఇత‌ర రాష్ట్రాలు, ప్రాంతాల‌కు చెందిన వారంతా పెద్ద ఎత్తున ఈ బోనాల సంద‌ర్బంగా త‌ర‌లి వ‌స్తారు.

ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ వారంటే వారికి ఎన‌లేని గౌర‌వం. అభిమానం కూడా. అంత‌కంటే భ‌క్తి. మొద‌ట మంత్రి తొలి పూజ చేస్తే మిగ‌తా భ‌క్తులు ద‌ర్శనం చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చారు.

ఇక అమ్మ వారికి బొనాలు స‌మ‌ర్పించేందుకు భ‌క్తులు బారులు తీరారు. ముందు జాగ్ర‌త్త‌గా సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు ఆరు క్యూ లైన్ల‌ను ఏర్పాటు చేశారు.

పెద్ద ఎత్తున పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉండేలా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీకగా బోనాల‌ను భావిస్తారు.

ఎప్ప‌టికీ ర‌ద్దీగా ఉండే సికింద్రాబాద్ మ‌రోసారి జ‌న‌సంద్రాన్ని త‌ల‌పింప చేసింది మ‌హంకాళి అమ్మ‌వారి బోనాల‌తో(Secunderabad Bonalu) .

Also Read : సంయ‌మ‌నంతోనే శాంతి సాధ్యం – ద‌లైలామా

Leave A Reply

Your Email Id will not be published!