Supreme Court : ఉద్దవ్..షిండే కేసులపై సుప్రీం విచారణ
20న కీలక తీర్పు వెలువరించే అవకాశం
Supreme Court : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమసి పోలేదు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల దెబ్బకు మహా వికాస్ అఘాడీ కూలి పోయింది. ఈ తరుణంలో శివసేన పార్టీ గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన వారంతా జెండా ఎగరవేసిన ఏక్ నాథ్ షిండే వైపు మళ్లారు.
ఈ తరుణంలో వారిని పార్టీ నుంచి వేటు వేస్తున్నట్లు, వారంతా పార్టీకి ద్రోహులంటూ శివసేన ప్రకటించింది. ఇదే సమయంలో వారు తమ పార్టీకి చెందిన వారు కాదని వారిపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ (Supreme Court) దాఖలు చేసింది.
దీనికి సంబంధించి ఈనెల 12 వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ డిప్యూటీ స్పీకర్ వేటు వేశారు. ఇదిలా ఉండగా తిరుగు బావుటా ఎగుర వేసిన ఏక్ నాథ్ షిండే ఊహించని రీతిలో సీఎంగా కొలువు తీరారు.
కాగా శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, సీఎం షిండే ఇద్దరూ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆయా వ్యాజ్యాలపై ఈనెల 20న భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ప్రధాన తీర్పు వెలువరించనున్నారు.
కాగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. మరో వైపు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు.
తుది తీర్పు వెలురించేంత వరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. కాగా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : సీజేఐ ఎన్వీ రమణ సంచలన కామెంట్స్