TS Tribal University : త్వరలోనే గిరిజన యూనివర్శిటీకి మోక్షం
పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే చాన్స్
TS Tribal University : బలిదానాల, ఆత్మ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతిదీ పోరాడి తెచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అంటే ఎనిమిదేళ్ల కాలంలో ప్రతి సారీ కేంద్రంతో యుద్దం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కు అడుగు అడుగునా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చింది ఇక్కడి ప్రభుత్వం. అయినా నిధుల మంజూరీలో జాప్యం కొనసాగుతూ వస్తోందంటూ ఆరోపిస్తోంది.
ఇక ఆదివాసీలు ఎక్కువగా ఉండే రాష్ట్రంలో వారి పిల్లల అభ్యున్నతి కోసం గిరిజన విశ్వ విద్యాలయం కావాలని ఎప్పటి నుంచో విన్నవిస్తూ వస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్ కోరుతూ వస్తున్నారు. కానీ కేంద్రం స్పందించ లేదు.
సరికదా దానిని రాజకీయం చేస్తూ పోయింది. తాజాగా పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విడుదల చేసిన బులిటెన్ లో గిరిజన యూనివర్శిటీకి మోక్షం కల్పించేందుకు బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
దీంతో సుదర్ఘ కాలం పాటు పోరాడుతూ వస్తున్న టీఆర్ఎస్ కు ఒక రకంగా బలం కలిగించే వార్త ఇది అని చెప్పక తప్పదు. గతంలో కేంద్రం హామీ కూడా ఇచ్చింది ఏపీ పునర్విభజన బిల్లులో. ఇక కేటీఆర్ 2014 నుంచి నెత్తీ నోరు బాదుకుంటున్నారు.
తమకు యూనివర్శిటీ కావాలని. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ములుగు జిల్లా జాకారంలో 335.04 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
మరో వైపు గిరిజన వర్శిటీతో(TS Tribal University) పాటు తెలంగాణకు ఎన్ఐటీ(NIT), ఐఐటీ(IIT), ఐఐఎం, ఐబీఎం, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరుతూ వచ్చి ప్రభుత్వం. కానీ పట్టించు కోలేదు కేంద్రం.
Also Read : ఐఐటీ మద్రాస్ కు ప్రపంచ గుర్తింపు