Digambar Kamat : మాజీ గోవా సీఎంకు సోనియా ఝలక్
కాంగ్రెస్ ప్యానల్ నుంచి తొలగింపు
Digambar Kamat : ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇటీవలే కరోనా నుంచి బయట పడ్డారు. ఈనెల 21న నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాల్సింది.
ఇది పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన మాజీ గోవా సీఎం దిగంబర్ కామత్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్యానెల్ లో శాశ్వత సభ్యుడిగా ఉన్న కామత్ ను తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదిలా ఉండగా గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా మైఖేల్ లోబోను కాంగ్రెస్ అధిష్టానం గతంలో తొలగించింది. కాగా గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ భారతీయ జనతా పార్టీతో కలిసి కుట్ర పన్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర పార్టీ ఇన్ చార్జ్ పూర్తి నివేదికను పార్టీ హైకమాండ్ కు , పార్టీ చీఫ్ సోనియా గాంధీకి అందజేసింది. దీంతో విచారణ చేపట్టిన కమిటీ ఇది వాస్తవమేనని తేల్చింది.
దీంతో నివేదిక ఆధారంగా సోనియా గాంధీ దిగంబర్ కామత్(Digambar Kamat) పై వేటు వేసింది. విచిత్రం ఏమిటంటే కామత్ ఇప్పుడు గోవా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ దేశ వ్యాప్తంగా కుట్రలు, కుయుక్తులకు తెర లేపింది.
Also Read : సిసలైన బీజేపీ సర్కార్ నడపడం లేదు