Uddhav Thackeray : శివసేన పార్టీ పలువురికి ఉద్వాసన
పట్టు కోసం ఉద్దవ్ ఠాక్రే ప్రయత్నం
Uddhav Thackeray : ఏక్ నాథ్ షిండే ధిక్కార స్వరం వినిపించిన తర్వాత బాల్ సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఎన్నడూ లేనంతగా కుదుపులకు లోనవుతోంది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
దీంతో పార్టీలో తీవ్ర తగాదాల ధ్య పార్టీ నుంచి పలువురు కీలక నేతలను తొలగించారు పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు.
ఇక ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రభుత్వాన్ని పడగొట్టి సీఎం పదవిని చేజిక్కించుకున్న ఏక్ నాథ్ షిండే ఠాక్రే శిబిరంలో అసంతృప్తులను చేర దీస్తున్నారు.
తన బలం మరింత పెంచుకునేలా చేస్తున్నారు. వారిని తమ వైపు తిప్పుకుంటున్నారు షిండే. ఇదే క్రమంలో తిరుగుబాటు శిబిరం నిజమైన శివసేన పార్టీ అంటూ ప్రకటించింది.
ఇరు వర్గాలు కోర్టుకు ఎక్కాయి. షిండే, బాల్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. ఆరోజు తుది తీర్పు వెలువడనుంది.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం, పార్టీలో విప్ లు, నియామకాల చట్ట బద్దతపై ఇరు పక్షాల నుంచి దాఖలైన పలు దావాలను పరిశీలించనుంది. ఈ తరుణంలో విచారణకు ముందే శివసేన వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రమైంది
. మాజీ మంత్రి విజయ్ శివ తారే, హింగోలీ జిల్లా చీఫ్ గా తొలగించబడ్డారు. ఇద్దరు కీలక నేతలను షిండే వర్గం తీసుకుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందన్న ఉత్కంఠకు తెరలేపింది మరాఠా రాజకీయం. ప్రస్తుతం ఠాక్రే తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది.
Also Read : జడ్జి ఇతర విషయాలపై ఫోకస్ పెట్టారు