Girls Removes Bras : ‘నీట్’ లో ‘బ్రా’ తొలగించారంటూ ఆరోపణ
కేరళలోని కొల్లంలో చోటు చేసుకున్న ఘటన
Girls Removes Bras : కేరళలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మెడికల్ ఎగ్జామ్ నీట్ కోసం నిర్వహంచిన ప్రవేక్ష పరీక్షకు సంబంధించి హాజరైన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది.
యువతులు, మహిళలు ఎక్కువగా వాడే బ్రాను బలవంతంగా తొలగించారంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
కేరళ లోని కొల్లాం జిల్లాలో ఉన్న నీట్ సెంటర్ లో మెటాలిక్ హుక్ కారణంగా తన బ్రాను తీసివేయమంటూ మహిళా భద్రతా సిబ్బంది సదరు విద్యార్థినిని కోరారు. ఈ పరీక్ష ఆదివారం నీట్ మెడికల్ ఎగ్జామ్ కు హాజరైంది.
ఓ విద్యార్థిని భద్రతా తనిఖీల్లో భాగంగా ఆమె బ్రాకు ఉన్న మెటల్ హుక్సులు(Girls Removes Bras) మోగడంతో పరీక్ష రాసే ముందు బ్రాను
బలవంతంగా తీయించారంటూ ఆరోపించింది. ఈ విషయం గురించి సదరు బాధిత విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మెటాలిక్ హుక్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని సదరు విద్యార్థిని వాపోయింది. తాను బ్రా తీయనంటూ ప్రతిఘటించింది.
ఆమెను మెడికల్ అడ్మిషన్ పరీక్షకు అనుమతించ బోమంటూ చెప్పారు. మీ భవిష్యత్తు మీకు ముఖ్యమా లేక మీకు ఇన్నర్ వేర్ (బ్రా) ముఖ్యమా
అని పేర్కొంటూ దానిని బలవంతంగా తీయించారంటూ వాపోయింది.
ఈ ఘటనకు కేరాఫ్ గా మారిన మార్తోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ మాత్రం తిరస్కరించింది. ఇదిలా ఉండగా బాలిక
పేరెంట్స్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొల్లం పోలీస్ చీఫ్ కే. బి. రవి వెల్లడించారు.
చాలా మంది బాలికలు తమ లో దుస్తులను బలవంతంగా తొలగించారని, వాటిని స్టోర్ రూమ్ లో పడేసి ఉంచారని వాపోయారు. పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని బాధితురాలి తండ్రి ఆవేదన చెందారు.
Also Read : అజారుద్దీన్ ఓ నియంత అక్రమాల పుట్ట