CBDT Shock : బ్యాంకు కస్టమర్లకు సీబీడీటీ బిగ్ షాక్
రూ. 20 లక్షలు డిపాజిట్ చేస్తే ఆధార్..పాన్
CBDT Shock : బ్యాంకు కస్టమర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ . ఒక ఏడాదిలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే విధిగా ఆధార్ కార్డు తో పాటు పాన్ కార్డు జత చేయాల్సి ఉంటుంది.
ఈ విషయాన్ని సీబీడీటీ(CBDT Shock) స్పష్టం చేసింది. డిపాజిట్ చేసినా లేదా బదిలీ చేసినా వీటిని సమర్పించాలి. లేక పోతు నగదు డిపాజిట్ కాదు. చట్ట విరుద్దమైన, లెక్కించ బడని నగదు లావాదేవీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
నగదు పరిమితి నిబంధనలను సవరించింది. పరిమితికి మించి నగదు చెల్లించడం లేదా స్వీకరించడం అనేది చెల్లించిన లేదా స్వీకరించిన మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధిస్తారు.
సీబీడీటీ తాజాగా రూపొందించిన రూల్స్ లలో పలు మార్పులు చేసింది. నగదు జమ చేసేటప్పుడు పాన్ వివరాలు తప్పనసరి చేసింది.
కొత్త రూల్స్ ప్రకారం ఒకే బ్యాంకు లేదా బహుళ బ్యాంకుల్లో ఒకే సంవత్సరంలో నగదు ఉపసంహరణలు , పెద్ద మొత్తాలు డిపాజిట్ చేయడం వంటివి ట్రాక్ చేసేందుకు కొత్త నిబంధన తీసుకు వచ్చింది సీబీడీటీ(CBDT Shock).
ప్రతి ఒక్కరు ఇక నుంచి ఏ లావాదేవీకైనా ఆధార్ కార్డు నెంబర్ తో పాటు పాన్ కార్డు నెంబర్ కూడా ఎంట్రీ చేయాలని స్పష్టం చేసింది.
పాన్ లేని వ్యక్తులు రోజుకు రూ. 50,000 కంటే ఎక్కువ లేదా ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఏదైనా లావాదేవీని నమోదు చేసేందుకు కనీసం 7 రోజుల ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Also Read : ఎన్నిక ముగిసింది ఫలితమే మిగిలింది