Sri Lanka President : శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ
చీఫ్ రేసులో రణిలే విక్రమ సింఘే
Sri Lanka President : శ్రీలంకలో చోటు చేసుకున్న సంక్షోభానికి తెర దించేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక, ఆహార, ఆయిల్, గ్యాస్, విద్యుత్ కొరతతో గత కొంత కాలం నుండి ద్వీప దేశం అట్టుడుకుతోంది ఆందోళనలు, నిరసనలతో.
జనం రోడ్లపైకి వచ్చారు. దేశ అధ్యక్షుడు గోటబయ రాజ పక్సే భవనాన్ని ముట్టడించారు. ఆపై పీఎం ఇంటిని ముట్టడించారు. వాహనాలు
తగులబెట్టారు. పరిస్థితి విషమించడంలో ప్రధానిగా ఉన్న మహీంద రాజపక్సే పదవికి రాజీనామా చేశాడు.
ప్రాణ భయంతో ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు. ఇంకో వైపు దాడి చేస్తారని ముందే గ్రహించిన ప్రెసిడెంట్ గోటబయ దొడ్డి దారిన పారి పోయాడు. దేశం విడిచి మాల్దీవులకు వెళ్లాడు.
అక్కడ తనను చంపేస్తారేమోనన్న భయంతో సింగపూర్ కు మకాం మార్చాడు. ఈ తరుణంలో తాత్కాలిక అధ్యక్షుడిగా పీఎం రణిలే విక్రమసింఘే ఉన్నారు.
225 మంది సభ్యులున్న పార్లమెంట్ లో శ్రీలంక దేశానికి(Sri Lanka President) కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు బుధవారం రోజు. ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ గా ఉన్న రణిలే విక్రమ సింఘేకే ఎక్కువ చాన్స్ ఉంటుందని అంచనా.22 మిలియన్ల మంది ప్రజలు ఆహారం, ఇంధనం , ఔషధాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ తరుణంలో రుణాలు తీసుకోవాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. శ్రీలంకకు ఆరు సార్లు ప్రధానమంత్రిగా పని చేశారు రణిలే విక్రమసింఘే.
కానీ ఆయనను అధ్యక్షుడిగా ఉండేందుకు ఒప్పు కోవడం లేదు లంకేయులు.
అయితే రణిలే గోటబయకు మిత్రుడని అతడిని తిరస్కరిస్తున్నారు జనం. లా అండ్ ఆర్డర్ అభ్యర్థిగా ఎదుగుతున్నాడంటూ
తమిళ ఎంపీ ధర్మ లింగం ఆరోపించారు.
ఇక విక్రమ సింఘేకు పోటీగా మాజీ విద్యా శాఖ మంత్రి డల్లాస్ అలహప్పెరుమ ఉన్నారు. ఒకవేళ గెలిస్తే ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసను
పీఎంగా నియమించాలని భావిస్తున్నారు.
అనురా దిసనాయకే కూడా బరిలో ఉన్నారు. చట్ట సభలో రహస్య బ్యాలెట్ లో ఎన్నిక జరుగుతుంది. ఎవరు పీఠం ఎక్కుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : అమిత్ షా ఫోటో షేర్ నిర్మాత ‘దాస్’ అరెస్ట్