Anurag Thakur : ఫ్యాక్ట్ చెక్ పేరుతో విద్వేషం త‌గ‌దు

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Anurag Thakur : కేంద్ర స‌మాచార , ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇటీవ‌ల 2018లో చేసిన ట్వీట్ పై ఫ్యాక్ట్ చెక్ , ఆల్ట్ న్యూస్ కో ఫౌండ‌ర్ మహ్మ‌ద్ జుబైర్ పై కేసు న‌మోదు చేశారు.

ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. అత‌డిపై ఏడు కేసులు న‌మోద‌య్యాయి. నిన్న మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి.

టెన్ష‌న్ ను వ్యాపింప చేసే వారి మ‌ధ్య వాస్త‌వ – చెక‌ర్ల మ‌ధ్య తేడాను ముందు గుర్తించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

నిజ నిర్దార‌ణ చేసే వ్య‌క్తికి నిన నిజ నిర్ధార‌ణ ముసుగులో శ‌త్రుత్వాన్ని వ్యాప్తి చేసేందుకు ప్ర‌య‌త్నించే వారికి మ‌ధ్య తేడాను గుర్తించ‌డం చాలా ముఖ్య‌మ‌న్నారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).

ఇదే విష‌యాన్ని ఆయ‌న గురువారం రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా స‌మాధానం ఇచ్చారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా త‌ను ఎలాంటి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని, కావాల‌ని ఇరికించారంటూ ఫ్యాక్ట్ చెకర్ మ‌హ్మ‌ద్ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ సంద‌ర్భంగా కేసును విచారించిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఒక వ్య‌క్తిని రాయొద్ద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌మంటూ ప్ర‌శ్నించింది. అత‌డిని ట్వీట్ చేయ‌కుండా నిలుపుద‌ల చేస్తూ ఆదేశించాల‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ధ‌ర్మాస‌నానికి విన్న‌వించారు.

ఈ సంద‌ర్భంగా సీజే డీవై చంద్ర‌చూడ్ ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అరెస్ట్ చేయ‌డం అన్న‌ది ప్రామాణికం కాకూడ‌ద‌న్నారు.

Also Read : విచార‌ణ పేరుతో క‌క్ష సాధింపు

Leave A Reply

Your Email Id will not be published!