Abhishek Banerjee : ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు టీఎంసీ దూరం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అభిషేక్ బెన‌ర్జీ

Abhishek Banerjee : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అభిషేక బెన‌ర్జీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో తాము పాల్గొన బోవ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టికే మ‌మ‌తా ఆధ్వ‌ర్యంలో విప‌క్షాలు క‌లిసి ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను నిలిపింది.

కానీ ఊహించ‌ని రీతిలో ఆయ‌న‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ త‌రుణంలో త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే మార్గరెట్ అల్వాను విప‌క్షాల త‌ర‌పున శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌క‌టించ‌డంపై గుర్రుగా ఉన్నారు దీదీ.

ఈ త‌రుణంలో గురువారం కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన అమ‌ర వీరుల దినోత్స‌వ ర్యాలీలో కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు అభిషేక్ బెన‌ర్జీ. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్నా వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో టీఎంసీ పాల్గొన‌ద‌న్నారు.

విప‌క్షాల‌లో చీలిక‌లు రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. ద్రౌప‌ది ముర్ముకు 71 శాతం ఓట్లు రావ‌డం పెద్ద షాక్. ఉభ‌య స‌భ‌లు లోక్ స‌భ‌, రాజ్య స‌భ‌లో టీఎంసీకి 35 మంది ఎంపీలు ఉన్నారు.

పార్టీతో స‌రైన సంప్ర‌దింపులు, చ‌ర్చ‌లు లేకుండానే ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థిని నిర్ణ‌యించినందున ఓటింగ్ ప్ర‌క్రియ‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు అభిషేక్ బెన‌ర్జీ(Abhishek Banerjee). ఆదివారం నాడు 18 రాజ‌కీయ పార్టీల స‌మావేశం జ‌రిగింది.

అనంత‌రం మార్గ‌రెట్ అల్వాను ప్ర‌తిప‌క్ష ఫ్రంట్ ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు. కాగా మొద‌ట‌గా కాశ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ పేరును మ‌మ‌తా బెన‌ర్జీ సూచించార‌ని శ‌ర‌ద్ ప‌వార్ తెలిపారు.

కానీ మెజారిటీ స‌భ్యులు మార్గరెట్ అల్వా పేరును ప్ర‌తిపాదించార‌ని చెప్పారు.

Also Read : బీజేపీ జైలును బ‌ద్ద‌లు కొట్టాలి – దీదీ

Leave A Reply

Your Email Id will not be published!