Security Forces : ముదిరిన సంక్షోభం ఖాకీల ఉక్కుపాదం
కొత్త అధ్యక్షుడు రణిలె నిర్వాకం
Security Forces : శ్రీలంకలో అధ్యక్షుడు మారినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గోటబయ రాజపక్సే స్థానంలో తాజాగా ప్రెసిడెంట్ గా కొలువు తీరిన రణిలె విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపు లోపే భదత్రా బలగాలు తమ లాఠీలు, తుపాకులకు పని చెప్పాయి.
విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డాయి. ఇప్పటికే శ్రీలంకలో ఆర్థిక, ఆహార, ఇంధన, విద్యుత్, గ్యాస్ సంక్షోభం నెలకొందని ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది యుఎన్ హక్కుల నిపుణుల బృందం.
రాజ భవనంలోనే కొంత మంది నిరసనకారులు ఉన్నారు. ఇంకో వైపు పీఎం ఇంటిని ముట్టడించారు. ప్రస్తుత అధ్యక్షుడికి చెందిన వాహనాలకు నిప్పంటించారు.
ఇంత జరుగుతున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు లంకేయులు. ఉన్నట్టుండి అర్ధరాత్రి భద్రతా బలగాలు(Security Forces) మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డాయి.
ఇది పూర్తిగా చట్ట విరుద్దం. ప్రెసిడెంట్ గా గెలిపించినా ప్రజలను పట్టించు కోక పోతే గోటబయకు పట్టిన గతే రణిలె విక్రమ సింఘేకు పడుతుందని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు.
అధ్యక్ష భవనం వద్ద ఏర్పాటు చేసిన గూడారాలను తొలగించారు బలవంతంగా. ఏప్రిల్ 9 నుంచి అధ్యక్షుడి కార్యాలయాన్ని మూసి వేశారు.
కొత్త అధ్యక్షుడు రణిలె విక్రమ సింఘే రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం ఆగదంటున్నారు ఆందోళనకారులు. ఆయన మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు.
కానీ మేం వెనుదిరిగేది లేదని కుండ బద్దలు కొడుతున్నారు. రణిలే బలగాలను చూసి మురిసి పోతున్నారు. కానీ చరిత్ర అతడిని క్షమించదు. యుద్దాన్ని ఆపే ప్రసక్తి లేదంటున్నారు నిరసనకారులు.
Also Read : రణిలెపై లంకేయుల రణనినాదం
BBC journalist among those who attacked by security forces in Galle Face protest site
📸 BBC Tamil Live pic.twitter.com/9xhpB7GhEM
— NewsWire 🇱🇰 (@NewsWireLK) July 21, 2022