Delhi LG CBI : కేజ్రీవాల్ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ
ఆదేశించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా
Delhi LG CBI : జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆప్ సర్కార్ తీసుకు వచ్చిన పాలసీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశించారు.
నిన్నటి దాకా ఉప్పు నిప్పులా ఉన్న కేంద్రం, ఢిల్లీ మధ్య మరింత అగాధాన్ని పెంచేలా చేసింది ఈ నిర్ణయం. ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు తాను వెళ్లాల్సి ఉన్నా మోదీ కావాలని అడ్డుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు అరవింద్ కేజ్రీవాల్.
ఈ తరుణంలో ఈ నిర్ణయం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇందులో ప్రధానంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు లెఫ్టినెంట్ గవర్నర్.
ప్రభుత్వం అందించిన నివేదిక ఉన్నత రాజకీయ స్థాయిలో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను సూచిస్తోందంటూ స్పష్టం చేశారు. ఒక రకంగా మెలిక పెట్టారు ఎల్జీ.
ఇదిలా ఉండగా ఢిల్లీ రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ 2021-2022 నవంబర్ 17 నుంచి అమలు లోకి వచ్చింది. ఈ పాలసీపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఎల్జీ(Delhi LG CBI). ఎక్సైజ్ శాఖ ఇన్ చార్జి మంత్రి అయిన మనీష్ సిసోడియా చట్ట పరమైన నిబంధణలు, నోటిఫైడ్ ఎక్సైజ్ పాలసీని ఉల్లంఘించారు.
భారీ ఆర్థిక పరమైన చిక్కులను కలిగి ఉన్న ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారంటూ పేర్కొన్నారు ఎల్జీ. టెండర్లు ముగిశాక కూడా సిసోడియా మద్యం లైసెన్స్ దారులకు అనవసరమైన ఆర్థిక సాయం అందించారని ఆరోపించారు.
Also Read : అట్టడుగు నుంచి అత్యున్నత స్థానం దాకా