BS Yediyurappa : అవినీతి కేసులో య‌డియూర‌ప్ప‌కు ఊర‌ట‌

సుప్రీంకోర్టు నుంచి మాజీ సీఎంకు ఉప‌శ‌మ‌నం

BS Yediyurappa : అవినీతి కేసుకు సంబంధించి క‌ర్ణాట‌క మాజీ సీఎం బీఎస్ య‌డియూర‌ప్ప‌కు సుప్రీంకోర్టు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించింది. భూ కేటాయింపు కుంభ కోణంలో నిందితుడైన ఈ మాజీ సీఎంపై న‌మోదైన ఎఫ్ఐఆర్ ను ర‌ద్దు చేసేందుకు క‌ర్ణాట‌క హైకోర్టు నిరాక‌రించింది.

2006-2007 లో అక్ర‌మంగా ఎక‌రాల భూమిని డీనోటిఫై చేసిన‌ట్లు బీఎస్ య‌డియూరప్ప‌పై(BS Yediyurappa) ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అవినీతి కేసుల్లో క్రిమిన‌ల్ ప్రొసీడింగ్ ల‌ను నిలిపి వేసింది సుప్రీంకోర్టు.

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు 2006-07లో అక్ర‌మంగా ఎక‌రాల భూమిని డీనోటిఫై చేసి ఆ భూమిని పారిశ్రామిక‌వేత్త‌ల‌కు కేటాయించార‌ని ఆరోపించారు.

బీఎస్ య‌డియూర‌ప్ప క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌పై అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదిల ఉండ‌గా త‌న‌పై క‌ర్ణాట‌క లోకాయుక్త పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ర‌ద్దు చేయాల‌న్న యెడియూర‌ప్ప అభ్య‌ర్థ‌న‌ను 2020లో హైకోర్టు తిర‌స్క‌రించింది.

అంతే కాకుండా విచార‌ణ‌లో జాప్యం చేస్తున్న పోలీసుల‌ను హైకోర్టు న్యాయ‌మూర్తి జాన్ మైఖేల్ కున్హా మంద‌లించారు. ఆల‌స్యం ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగింద‌ని ప‌రిస్థితులు అందుకు స్ప‌ష్టంగా సూచిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

2013లో మాజీ సీఎం బెల్లందూరు, దేవ‌ర బీస‌న‌హ‌ళ్లిలో ఐటీ పార్కును అభివృద్ధి చేసేందుకు సేక‌రించిన భూమిని డీనోటిఫై చేశారని వాసుదేవ రెడ్డి అనే వ్య‌క్తి చేసిన ప్రైవేట్ ఫిర్యాదు మేర‌కు యెడియూర‌ప్ప‌పై అదే ఏడాదిలో కేసు న‌మోదైంది.

గ‌త కొంత కాలంగా క‌ర్ణాట‌క‌లో చ‌క్రం తిప్పుతూ వ‌చ్చిన బీఎస్ యెడ్డీకి బీజేపీ హై క‌మాండ్ పొమ్మ‌న‌కుండా పొగ్ పెట్టింది. దీంతో ఆయ‌న త‌నంత‌కు తాను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.

Also Read : ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ పై ఆప్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!