YS Jagan : ప‌నుల ప్ర‌గ‌తిపై సీఎం జ‌గ‌న్ సంతృప్తి

విద్యా శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టిన సీఎం

YS Jagan : ఏపీలో విద్యా శాఖ పై స‌మీక్ష చేప‌ట్టారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. శుక్ర‌వారం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ మేర‌కు పెద్ద ఎత్తున ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. ఎక్క‌డా నిధుల మంజూరీలో త‌గ్గ‌డం లేద‌న్నారు. చ‌దువుతోనే బాగు ప‌డ‌తార‌న్న సంగ‌తి గుర్తించాల‌న్నారు. గ‌తంలో ఇచ్చిన ఆదేశాలు ఎంత వ‌ర‌కు అమ‌లు అవుతున్నాయి,

నాడు నేడు కింద 22,344 స్కూళ్ల‌లో ఏమేం చేపడుతున్నారంటూ ఆరా తీశారు. రెండో ద‌శ నాడు నేడు ప‌నుల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయాల‌న్నారు. స్కూళ్ల‌లో విలువైన ఉప క‌ర‌ణాల‌ను ఏర్పాటు చేస్తుండ‌డంతో ఫోక‌స్ పెట్టాల‌ని ఆదేశించారు సీఎం.

సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా దృష్టి సారించాల‌న్నారు. విద్యా వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారం పూర్తి కావాల‌ని పేర్కొన్నారు. డేటా నిరంత‌రం అప్ లోడ్ చేయాల‌ని ఆదేశించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan).

జిల్లా స్థాయిలలో క‌లెక్ట‌ర్లు కూడా స‌మీక్ష చేప‌ట్టాల‌ని సూచించారు సీఎం. త‌ర‌గ‌తి గ‌దుల్లో డిజిల్ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు.

స్మార్ట్ బోధ‌న స‌దుపాయాల వ‌ల్ల పిల్ల‌లు, టీచ‌ర్ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. స్కూళ్ల‌కు సంబంధించి ఏర్పాటు చేసే ప్ర‌తి వ‌స్తువు నాణ్య‌వంతంగా ఉండాల‌ని ఆదేశించారు.

పీపీ 1 నుంచి రెండో త‌ర‌గ‌తి దాకా స్మార్ట్ టీవీలు, 3వ త‌ర‌గ‌తి ఆపైన ప్రాజెక్ట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. విద్యార్థుల‌కు అంద‌జేసే ట్యాబ్ లు నాణ్య‌వంతంగా ఉండాల‌న్నారు సీఎం(YS Jagan).

Also Read : అసోం క‌ళాకారుడి ప్ర‌తిభ‌కు మోదీ ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!