Mohammed Zubair : ట్వీట్ కోసం రూ. 2 కోట్లు తీసుకోలేదు

అదంతా అబ‌ద్దం అవాస్త‌వ‌మ‌న్న జుబైర్

Mohammed Zubair : మ‌త ప‌ర‌మైన మ‌నో భావాల‌ను రెచ్చ గొట్టాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయి ఇటీవ‌లే బెయిల్ పై విడుద‌లైన ఫ్యాక్ట్ చెక‌ర్ , ఆల్ట్ న్యూస్ కో ఫౌండ‌ర్ మ‌హ్మ‌ద్ జుబైర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

తీహార్ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రెండు రోజుల త‌ర్వాత తాను మునుప‌టి లాగే ప‌ని చేస్తాన‌ని చెప్పారు. త‌న ట్వీట్ల‌తో ఇత‌రుల మ‌నో భావాల‌ను దెబ్బ తీశారంటూ ఫిర్యాదు అంద‌డంతో గ‌త జూన్ 27న మ‌హ్మ‌ద్ జుబైర్(Mohammed Zubair) ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

భారత దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు త‌న‌పై ఎలాంటి ప‌రిమితులు విధించ లేద‌న్నారు జుబైర్. దీంతో య‌థావిధిగా త‌న ప‌ని చేసుకుంటూ పోతాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నాడు. అయితే తాను చేసిన ట్వీట్ల కు సంబంధించి త‌న‌కు రూ. 2 కోట్లు అందుకున్నానంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

అదే రెండు కోట్లు తీసుకుంటే ఇంత దాకా ఎందుకు తాను వ‌స్తాన‌ని పేర్కొన్నాడు. తాను ఏనాడూ డ‌బ్బుల కోసం ప‌ని చేయ‌డం లేద‌న్నారు. స‌మాజ హితం కోసం తాము ఆల్ట్ న్యూస్ ను ఏర్పాటు చేశామ‌న్నాడు.

ఫ్యాక్ట్ చెక్ అన్న‌ది ఇవాళ అత్యంత పాపుల‌ర్ గా మారింద‌న్నారు. త‌న‌తో పాటు ఇత‌రులు కూడా ఇందులో భాగం పంచుకున్నార‌ని తెలిపాడు. విష‌యాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్లుగా తెలియ చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మ‌హ్మ‌ద్ జుబైర్.

ఇదిలా ఉండ‌గా విచార‌ణ సంద‌ర్భంగా తాను రూ. 2 కోట్లు తీసుకున్న‌ట్లు అధికారులు అడ‌గ‌లేద‌న్నారు. తాను విడుద‌లైన త‌ర్వాతే ఈ ఆరోప‌ణ గురించి త‌న‌కు తెలిసింద‌న్నాడు.

యూపీ కోర్టులో ప్ర‌భుత్వం ఈ ఆరోప‌ణ చేసింది. అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గ‌రిమా ప్ర‌సాద్ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. అత‌డు జ‌ర్న‌లిస్ట్ కాడ‌ని హానిక‌ర‌మైన ట్వీట్ల‌తో సంపాదిస్తున్నాడ‌ని ఆరోపించాడు.

Also Read : దివ్యాంగుల‌ను ఆపితే క‌ఠిన చ‌ర్య‌లు – డీజీసీఏ

Leave A Reply

Your Email Id will not be published!