Telangana Governor : విమానంలో ప్రాణం కాపాడిన గవర్నర్
ప్రాణాపాయం నుంచి బయట పడిన రోగి
Telangana Governor : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ , పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ అయిన తమిళ సై సౌందర్య రాజన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె మానవతను చాటుకున్నారు. ఎంతో కష్టపడి డాక్టర్ చదువుకున్నారు.
ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. తమిళనాడులో బీజేపీకి ఓ స్టేటస్ తీసుకు వచ్చేలా చేశారు. తమిళిసై పనితీరును చూసి దేశ ప్రధాన మంత్రి మోదీ గవర్నర్ గా అత్యున్నత పదవిని ఇచ్చారు.
దానిని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ తరుణంలో ఆమె పని మీద ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో తాను గవర్నర్ అన్న దానిని వదిలేసి వృత్తి ధర్మాన్ని పాటించారు తమిళి సై సౌందర్య రాజన్(Telangana Governor). వెంటనే స్టెత స్కోప్ తీసుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్న 1194వ బ్యాచ్ అధికారి అయిన కృపానంద్ త్రిపాఠి ఉజేలా కు చికిత్స అందించారు.
డెంగ్యూ జ్వరంతో బాధ పడుతున్న ఆయనను సేవ్ చేశారు గవర్నర్. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వెళుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిపాఠి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఐపీఎస్ అధికారి.
ఈ సందర్భంగా త్రిపాఠి స్పందించారు. గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్(Telangana Governor) కు రుణపడి ఉన్నా. సమయానికి వచ్చారు. నా ప్రాణాలను కాపాడారు. ఆమెకు జీవితాంతం రుణపడి ఉన్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు త్రిపాఠి.
ఏపీ కేడర్ కు చెందిన ఏజేలా ప్రస్తుతం అదనపు డీజీపీ (రోడ్డు భద్రత) గా నియమితులయ్యారు.
Also Read : అప్రమత్తంగా ఉండండి భరోసా ఇవ్వండి – సీఎం