Chandrakant Patil : షిండేపై బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
ఇష్టం లేకున్నా ఒప్పుకున్నామన్న పాటిల్
Chandrakant Patil : మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్(Chandrakant Patil) సంచలన కామెంట్స్ చేశారు. తమకు ఏక్ నాథ్ షిండే సీఎం కావడం ఇష్టం లేదన్నారు. కానీ పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు తాము ఒప్పుకోక తప్పలేదన్నారు.
కానీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండాల్సి ఉందన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇప్పటికే మహా వికాస్ అఘాడీలో శివసేన తరపున తిరుగుబాటు జెండా ఎగుర వేసి భారతీయ జనతా పార్టీతో జత కట్టి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశారు సీఎం షిండే.
ఇదిలా ఉండగా ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదని, అప్రజాస్వామికమని శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తో పాటు తనయుడు మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే చెబుతూ వస్తున్నారు.
బీజేపీ ఆడుతున్న గేమ్ ప్లాన్ లో షిండే బలి కాక తప్పదన్నారు. ఏదో ఒకరు రెబల్ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరిగి తమ గూటికి రావాల్సిందేనంటూ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజా యాత్ర చేపట్టారు. ఎలా మోసం చేశారనే దానిపై ప్రచారం చేస్తూ ముందుకెళుతున్నారు.
ఈ తరుణంలో కొత్తగా ఇంకా క్యాబినెట్ పూర్తి కాలేదు. ఈ సమయంలో బీజేపీ చీఫ్ నోరు జారడంపై భగ్గుమంటున్నారు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ విషయం గురించి సీఎం ఏక్ నాథ్ షిండేతో ప్రస్తావించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఆటో రిక్షా నడుపుతూ 18 ఏళ్లకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షిండే మామూలోడు కాదు. మాస్ లీడర్.
Also Read : దోషిగా తేలితే మంత్రిపై వేటు – టీఎంసీ