Raj Thackeray : ఉద్దవ్ ఠాక్రే వల్లనే సర్కార్ కూలింది
రాజ్ ఠాక్రే సంచలన కామెంట్స్
Raj Thackeray : మహా రాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేను టార్గెట్ చేశారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చి వేయలేదన్నారు. ఉద్దవ్ ఠాక్రే వల్లనే ఎంవీఏ సర్కార్ కూలిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత కొంత కాలంగా అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్ కారణమంటూ శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చేస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేశారు.
ఇదంతా పూర్తి గా అబద్దమన్నారు. ప్రభుత్వాన్ని నడపాల్సిన వ్యక్తి మౌనంగా ఉన్నారని ఇంతకంటే ఇంకేం చేయగలరంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఉద్దవ్ , రాజ్ ఠాక్రేలు ఒకే కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఇద్దరూ బద్ద శత్రువులుగా మారారు.
మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే చనిపోయాక ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరిగింది. రాజ్ ఠాక్రే ఓ జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన మొదటి నుంచీ ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) సర్కార్ ను టార్గెట్ చేసింది. ఒకానొక దశలో డెడ్ లైన్ కూడా విధించింది. ఇక శివసేనలో తిరుగుబాటు జెండా ఎగుర వేయడం, ఏక్ నాథ్ షిండే సీఎం కావడం జరిగింది.
డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా రాజ్ ఠాక్రేను(Raj Thackeray) కలుసుకున్నారు. ఇటీవల ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మర్యాద పూర్వకంగా కలిసినట్లు ఈ సందర్భంగా తెలిపారు ఫడ్నవీస్.
Also Read : ఈడీ సమన్లపై 26న నిరసన – శివకుమార్