Elon Musk : గూగుల్ కో ఫౌండర్ భార్యతో సంబంధం అబద్దం
బార్ లో ఉన్నాం కానీ బంధం లేదన్న మస్క్
Elon Musk : టెస్లా సిఇఓ కమ్ చైర్మన్ అయిన ఎలోన్ మస్క్ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్నటి దాకా ట్విట్టర్ ను కొనుగొలు చేస్తానంటూ చెప్పి ఆ తర్వాత దానికి గుడ్ బై చెప్పేశాడు.
తాజాగా మరో సంచలన కథనం ఎలోన్ మస్క్ పై కలకలం రేపింది. అదేమిటంటే ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గా పేరొందిన గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానహాన్ తో అఫైర్ ఉందంటూ ఆ కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
దీంతో ఒక్కసారిగా ఎలోన్ మస్క్ , నికోల్ షానహాన్ మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తీవ్ర దుమారం చెలరేగడంతో టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ స్పందించాడు.
సెర్గీ తాను స్నేహితులమని, గత రాత్రి పార్టీలో కలిసి ఉన్నామని చెప్పాడు. స్నేహితులు కలిసి పార్టీలో ఉండడం సహజమేనని పేర్కొన్నాడు. కలిసి ఉన్నంత మాత్రాన సంబంధం అంటగడితే ఎలా అని ప్రశ్నించాడు ఎలోన్ మస్క్(Elon Musk).
గూగుల్ కో ఫౌండర్ భార్య తన స్నేహితురాలే తప్ప ఫియాన్సీ కాదన్నాడు. నికోల్ షానహాన్ తో ఎఫైర్ ఉందంటూ ప్రచురించిన మీడియా కథనాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు..ఖండించాడు ఎలోన్ మస్క్.
తాను గత మూడు సంవత్సరాలలో నికోల్ ను మూడు సార్లు మాత్రమే చూశానని తెలిపాడు. కలిసిన ప్రతిసారీ చాలా మంది నాతో పాటు ఉన్నారు. ఎక్కడికి ఏకాంతంగా వెళ్లింది ఏమీ లేదన్నాడు.
ఈ విషయాన్ని ఎలోన్ మస్క్ ట్వీట్ ద్వారా తెలియ చేశాడు. కాగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ కథనాన్ని జోడించింది.
Also Read : ఫోర్బ్స్ జాబితాలో హఫీజ్ కు చోటు