Droupadi Murmu : అట్ట‌డుగు వ‌ర్గాల సంక్షేమమే ల‌క్ష్యం

యువ‌త దేశం కోసం పాటు ప‌డాలి

Droupadi Murmu : భార‌త దేశ 15వ రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు ద్రౌప‌ది ముర్ము. అనంత‌రం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. దేశానికి సంబంధించి ప‌లు కీల‌క అంశాల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.

అట్ట‌డుగు వ‌ర్గాల సంక్షేమమే ల‌క్ష్యంగా ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ దేశంలో ఎవ‌రైనా క‌ల‌లు క‌న‌వ‌చ్చు. వాటిని సాకారం చేసుకునే అద్భుత‌మైన అవ‌కాశం ఇక్క‌డ త‌ప్ప ఇంకెక్క‌డా ల‌భించ‌ద‌న్నారు.

అంత‌కు ముందు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ద్రౌప‌ది ముర్ముతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఎవ‌రైనా రాష్ట్ర‌ప‌తి కావ‌చ్చ‌ని త‌న‌ను చూస్తే తెలుస్తుంద‌న్నారు.

ప్రాథ‌మిక విద్య‌ను పొంద‌డం త‌న మొద‌టి క‌ల అని దానిని కంప‌ల్స‌రిగా అందించేలా చూస్తాన‌ని చెప్పారు. నేను యువ‌త‌కు చెప్పేది ఒక్క‌టే. మీ భ‌విష్య‌త్తుపై దృష్టి పెట్ట‌కండి. దేశ భ‌విష్య‌త్తుకు పునాది వేయండి అని ద్రౌప‌ది ముర్ము(Droupadi Murmu) పిలుపునిచ్చారు.

రాష్ట్ర‌ప‌తిగా నా పూర్తి మ‌ద్ద‌తు మీకే ఉంటుంద‌న్నారు. భార‌త దేశం ప్ర‌తి రంగంలోనూ అభివృద్ధి సాధిస్తోంది. కొత్త పుంత‌లు తొక్కుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా ఈ దేశం ఎంతో స‌మ‌ర్థ‌త‌తో పోరాడింది.

ప్ర‌పంచానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌ని పేర్కొన్నారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. ఎవ‌రైనా స‌రే త‌న‌ను క‌ల‌వ‌చ్చ‌ని చెప్పారు. ఏ స్థాయిలో ఉన్నా మూలాలు మ‌రిచి పోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు ద్రౌప‌ది ముర్ము.

ప్ర‌తి ఒక్క‌రు చ‌దువు కోవాల‌ని పిలుపునిచ్చారు. విద్య‌తోనే వికాసం అల‌వడుతుంద‌ని, దానితోనే గుర్తింపు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర‌ప‌తి.

Also Read : ఈ దేశంలో ఎవ‌రైనా రాష్ట్ర‌ప‌తి కావ‌చ్చు

Leave A Reply

Your Email Id will not be published!