US Medicos Walk Out : మిచిగాన్ యూనివ‌ర్శిటీలో క‌ల‌క‌లం

యాంటీ అబార్ష‌న్ పై స్టూడెంట్స్ వాకౌట్

US Medicos Walk Out : మిచిగాన్ యూనివ‌ర్శిటీలో క‌ల‌క‌లం రేగింది. మెడిక‌ల్ స్కూల్ విద్యార్థులు వైట్ కోట్ వేడుక‌లో అబార్ష‌న్ వ్య‌తిరేక వైద్యుడు క్రిస్టిన్ కొలియ‌ర్ ప్ర‌సంగాన్ని నిర‌సిస్తూ స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పోయారు.

ముఖ్య వ‌క్త‌గా డాక్ట‌ర్ క్రిస్టిన్ కొలియ‌ర్ హాజ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వైట్ కోట్ అనేది ప్ర‌తి ఏటా అధికారికంగా జ‌రిగే కార్య‌క్ర‌మం.

దీనిలో విద్యార్థులు వైద్య రంగంలోకి ప్ర‌వేశించినందుకు గుర్తుగా తెల్ల కోటుల‌ను అంద‌జేస్తారు. దీంతో వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థులంతా డాక్ట‌ర్ ప్ర‌సంగించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

మెడిక‌ల్ స్టూడెంట్స్ వాక్ అవుట్(US Medicos Walk Out)  చేశారు. కేవ‌లం ఈ వీడియోకు 10 గంట‌ల లోపే 2.8 మిలియ‌న్ల‌కు పైగా చూశారు. వైట్ కోట్ వేడుక‌కు ప్ర‌ధాన వ‌క్త‌గా డాక్ట‌ర్ క్రిస్టిన్ కొలియ‌ర్ ను ఎంపిక చేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు.

340 మంది విద్యార్థులు పిటిష‌న్ పై సంత‌కం చేశారు. ఆ మేర‌కు స‌మావేశం నుంచి వాకౌట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇన్ క‌మింగ్ విద్యార్థుల‌తో పాటు మిచిగాన్ మెడిసిన్ నివాసితులు , వైద్యులు, గ్రాడ్యూయేట్ విద్యార్థులు, పూర్వ విద్యార్థుల‌తో స‌హా 72 మంది క‌మ్యూనిటీ స‌భ్యులు పిటిష‌న్ పై సంత‌కం చేయ‌డం విశేషం.

అబార్ష‌న్ వ్య‌తిరేక అభిప్రాయాల‌ను పంచుకున్నారు చాలా సార్లు.

Also Read : గూగుల్ కో ఫౌండ‌ర్ భార్య‌తో సంబంధం అబ‌ద్దం

 

Leave A Reply

Your Email Id will not be published!