School Memories : రాష్ట్ర‌ప‌తి అయినా మేడం మాకు టీచ‌రే

గుర్తు చేసుకున్న శ్రీ అర‌బిందో సెంట‌ర్

School Memories : భార‌త దేశ అత్యున్న‌త ప‌ద‌విగా భావించే రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు ఒడిశాకు చెందిన ద్రౌప‌ది ముర్ము. పేద కుటుంబం నుంచి ఇంత దాకా వ‌చ్చారు.

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసుకున్న భ‌ర్త , పిల్ల‌లు , త‌ల్లి దూర‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో బ్ర‌హ్మ కుమారీస్ ను ఆశ్ర‌యించారు ద్రౌప‌ది ముర్ము. క‌ష్ట‌ప‌డి చ‌దివి జూనియ‌ర్ అసిస్టెంట్ గా ప‌ని చేశారు.

కౌన్సిల‌ర్ గా ఎన్నిక‌య్యారు. బీజేపీలో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. రెండు సార్లు ఒడిశా రాష్ట్రంలో మంత్రిగా ప‌ని చేశారు. 2015లో జార్ఖండ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేశారు ద్రౌప‌ది ముర్ము. ఈ బ‌తుకు ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయి.

సాంత్వ‌న కోసం ఆమె పిల్ల‌ల‌కు ఎలాంటి పైసా జీతంగా తీసుకోకుండా పాఠాలు బోధించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీకి ఇప్పుడు 1,400 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

ప్ర‌స్తుతం త‌మ‌కు పాఠాలు, నీతి సూత్రాలు బోధించిన ద్రౌప‌ది ముర్ము మేడంను గుర్తు(School Memories) చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరిన ద్రౌప‌ది ముర్ము 1994 నుండి 1997 వ‌ర‌కు ఒడిశా లోని రాయంగ్ పూర్ లోని శ్రీ అర‌బిందో ఇంటిగ్ర‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ సెంట‌ర్ లో బోధించారు.

ఆ కాలానికి ఎలాంటి వేత‌నం పుచ్చుకోక పోవ‌డం విశేషం. ఇవాళ చేసిన ప్ర‌సంగంలో ద్రౌప‌ది ముర్ము కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రాథ‌మిక విద్య పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని, విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌న్నారు.

ఈ పాఠ‌శాల మ‌యూర్ భంజ్ జిల్లా లోని పాఠ‌శాల ఉంది. 25 ఏళ్ల కంటే ముందు , రాజ‌కీయ జీవితం ప్రారంభం కంటే ముందు పిల్ల‌ల‌కు పాఠాలు వ‌ల్లె వేశారు. (ఫోటో ఎన్డీటీవీ సౌజ‌న్యంతో )

Also Read : అట్ట‌డుగు వ‌ర్గాల సంక్షేమమే ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!