PM Modi : ద్రౌపది ముర్ము దేశానికి గర్వ కారణం
కొనియాడిన ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi : 15వ భారత దేశ రాష్ట్రపతిగా కొలువు తీరిన ద్రౌపది ముర్ముపై ప్రశంసల వర్షం కురిపించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) . రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చేసిన మొదటి ప్రసంగం ఆశ, కరుణ సందేశాన్ని అందించిందని పేర్కొన్నారు.
యావత్ భారత దేశమంతా ఇవాళ పండగ జరుపుకుంటోందని ఒక రకంగా చెప్పాలంటూ ఇది తనకే కాదు 133 కోట్ల భారతీయులకు గర్వ కారణమని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశంలోని పేదలు, అట్టడుగు, అణగారిన వర్గాల వారికి జలకళను సంతరించుకుందని ప్రశంసించారు మోదీ.
ఆమె భారత దేశం సాధించిన విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. భారత దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను గుర్తించే సమయంలో ముందుకు సాగే మార్గం గురించి భవిష్యత్తు దృష్టిని అందించిందని పేర్కొన్నారు నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా రాష్ట్రపతిగా ఆమె ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై పోటీ చేసి గెలుపొందారు. ఒడిశా ఆమె స్వస్థలం అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చారు.
జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. కీలక పదవులు చేపట్టారు. ఒడిశా రాష్ట్రంలో రెండుసార్లు మంత్రి గా పని చేశారు.
2015లో జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా కొలువు తీరారు. కొన్నాళ్ల పాటు ఉచితంగా పిల్లలకు పాఠాలు చెప్పారు. ఇదిలా ఉండగా దేశానికి రాష్ట్రపతిగా కొలువు తీరిన మొదటి గిరిజన మహిళ ఆమె కావడం విశేషం.
Also Read : గౌరవ వందనం రాష్ట్రపతి స్వీకారం