Congress Mps Suspended : నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
సమావేశాలు ముగిసేంత వరకు వేటు
Congress Mps Suspended : లోక్ సభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ తరుణంలో దేశంలో ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎఎంపీలు.
ఏదైనా నిరసన తెలియ చేయాలని అనుకుంటే సభ బయట చేయాలని కానీ సభ లోపట తాము ఒప్పుకోబోమంటూ హెచ్చరించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.
అయినా వినిపించు కోకుండా దేశ ప్రజలపై పెను భారం మోపుతున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్ , జోతిమణి , రమ్య హరి దాస్ , టీఎన్ ప్రతాపన్. వీరు ప్ల కార్డులతో తీవ్ర అభ్యంతరం తెలిపారు.
కేంద్రంలో కొలువు తీరిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆరోపించారు. దేశ ప్రజలు ఓ వైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే నిత్యావసరాలపై ధరలు తగ్గించాలని కోరుతూ ప్ల కార్డులు ప్రదర్శించారు.
దీంతో స్పీకర్ ఆ నలుగురు ఎంపీల ప్రవర్తన బాగోలేదంటూ పేర్కొన్నారు. సభా నియమాళికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ , నిరసన తెలిపే పద్దతి ఇది కాదంటూ మండిపడ్డారు.
ఈ మేరకు ఆ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు(Congress Mps Suspended) ప్రకటించారు. వీరిపై నిషేధం లోక్ సభ సమావేశాలు ముగిసేంత వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.
అనంతరం స్పీకర్ చర్య ను నిరసిస్తూ ఆ నలుగురు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ వారిలో కొందరిని సస్పెండ్ చేయడం ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు.
Also Read : పార్థా ఛటర్జీ ఫోన్ చేసినా పలకని సీఎం