Droupadi Murmu : రాష్ట్రపతికి దేశాధినేతల కంగ్రాట్స్
చైనా, శ్రీలంక చీఫ్ ల అభినందన
Droupadi Murmu : భారత దేశానికి 15వ రాష్ట్రపతిగా కొలువు తీరిన ద్రౌపది ముర్ముకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మహిళా మీరు ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిలె విక్రమ సింఘె స్పందించారు.
మీ సారథ్యంలో భారత దేశం మరింత ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ ఏకంగా లేఖను పంపించారు.
ఈ లేఖలో మీ నాయకత్వంలో భారత్ పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు కోరారు. రాజకీయంగా ఇరు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేందుకు , ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించేదుకు దోహద పడాలని కోరారు.
విభేదాలను వీడి కలిసి పని చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా లేఖలో స్పష్టం చేశారు. చైనా, భారత్ రెండూ ఒక్కటేనని కానీ పాలనా పరంగా వేరు కావచ్చని పేర్కొన్నారు జిన్ పింగ్.
ఆరోగ్య కరమైన, స్థిరమైన చైనా, భారత్ సంబంధాలు రెండు దేశాలు, వారి ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని అన్నారు లేఖలో. ప్రపంచ వ్యాప్తంగా ఇరు దేశాలు ఆదర్శ ప్రాయంగా నిలవాలని తాను కోరుకుంటున్నట్లు జిన్ పింగ్ తెలిపారు.
ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు ద్రౌపది ముర్ము(Droupadi Murmu)తో కలిసి పని చేస్తామని చైనా ప్రభుత్వ మీడియా సోమవారం తెలిపింది.
అతి పెద్ద ప్రజాస్వామ్యానికి మీరు రక్షణ కవచంగా నిలబోతున్నారని రణిలె విక్రమ సింఘే పేర్కొన్నారు. మీ సామర్థ్యం, రాజకీయ నాయకత్వంపై దేశ ప్రజలు, ప్రజా ప్రతినిధులు మీపై పెద్ద నమ్మకాన్ని కలిగి ఉన్నారని తెలిపారు.
Also Read : ఖర్గేకు అవమానం కాంగ్రెస్ ఆగ్రహం