Subhash Patriji : సుభాష్ పత్రీజీకి కన్నీటి వీడ్కోలు
కడ్తాల్ ఆశ్రమంలో అంత్యక్రియలు
Subhash Patriji : కిడ్నీ వ్యాధితో కన్ను మూసిన ప్రముఖ ఆధ్యాత్మిక, ధ్యాన గురువు సుభాష్ పత్రీజికి(Subhash Patriji) కన్నీటి వీడ్కోలు పలికారు భక్తులు, ధ్యాన ప్రియులు. ఆదివారం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంలో ఆదివారం మృతి చెందారు.
గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నారు. పత్రీజీని ఉమ్మడి పాలమూరు జిల్లా లోని కడ్తాల్ లోని కైలాస పురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తరలించారు.
సోమవారం సాయంత్రం ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఇదిలా ఉండగా సుభాష్ పత్రీజీ ధ్యానం ద్వారా పేరొందారు.
వేలాది మందిని ఆయన ధ్యానం వైపు మల్లేలా చేశారు. 1947లో నిజామాబాద్ లోని బోధన్ లో పుట్టారు. అనంతరం కర్నూల్ లోని కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో పని చేశారు.
2012లో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లిలో మహేశ్వర మహా పిరమిడ్ ను నిర్మించారు. అదే ఏడాది డిసెంబర్ 18 నుంచి జనవరి 31 వరకు ప్రపంచ ధ్యాన మహా సభలు నిర్వహించారు.
సుభాష్ పత్రీజీ గతంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను సైతం స్థాపించారు. పలు పుస్తకాలు రాశారు. ఆయనకు పలు భాషల్లో పట్టుంది.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఆయనకు అభిమానులుగా, శిష్యులుగా ఉన్నారు. శ్వాస మీద ధ్యాస పేరును సుభాష్ పత్రీజీ మరింత పాపులర్ అయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, ధ్యాన గురువులు పత్రీజీని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
Also Read : విద్యాలయాల్లో సమాజ సేవ అవసరం