Mamata Banerjee : తప్పు చేయను చేస్తే సహించను – దీదీ
సంచలన కామెంట్స్ చేసిన సీఎం
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన జీవితం తెరిచిన పుస్తకమన్నారు. ఇప్పటి వరకు ఒక్క పైసా జీతం తీసుకోలేదన్నారు.
ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోను సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంతే కాదు గతంలోనూ ఇప్పుడు కూడా అవినీతికి పాల్పడే వారికి , తప్పులు చేసే వారికి తాను మద్దతుగా నిలవబోనని చెప్పారు.
సోమవారం మమతా బెనర్జీ(Mamata Banerjee) మీడియాతో మాట్లాడారు. ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే , ఒక వేళ శిక్ష పడినా లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడినా తానేం అనుకోనని స్పష్టం చేశారు.
అలాంటి వ్యవహారాలలోకి తనను లాగద్దని సూచించారు. తాను సర్కార్ నుంచి వచ్చే జీతం కూడా తీసుకోవడం లేదని ఇంతకంటే తాను ఇంకేమీ చెప్పలేనన్నారు.
ప్రస్తుతం సీఎం దీదీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇదిలా ఉండగా బెంగాల్ లో టీచర్ల రిక్రూట్ మెంట్ స్కీంలో కీలక పాత్రధారిగా భావిస్తూ అప్పటి విద్యా శాఖ మంత్రి, ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
మంత్రికి సహచరురాలిగా భావిస్తున్న సినీ నటి అర్షిత ఛటర్జీ ఇంట్లో దాడి చేసింది. రూ. 20 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. విద్యా శాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్యే పై దాడులకు పాల్పడింది. ఓ ర్యాలీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం కలకల రేగింది.
Also Read : రాష్ట్రపతికి దేశాధినేతల కంగ్రాట్స్