Margaret Alva : నా ఫోన్ ను పునరుద్దరించండి – అల్వా
ఎంటీఎన్ఎల్ కి ఉప రాష్ట్రపతి అభ్యర్థి
Margaret Alva : ప్రతిపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పనిలో పనిగా ఎంతో మందికి ఫోన్ చేసినా పట్టించు కోలేదన్నారు. తన ఫోన్ పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా తన ఫోన్ పునరుద్దరించాలని కోరుతూ ఆపరేటర్ ను కోరారు మార్గరెట్ అల్వా(Margaret Alva). ఈ మేరకు మార్గరెట్ అల్వా మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్ ) నుండి కమ్యూనికేషన్ ను పోస్ట్ చేసింది.
కేవైసీ నిలిపి వేయబడిందని తన సిమ్ కార్డు 24 గంటల్లో బ్లాక్ చేయబడుతుందని పేర్కొంది. తాను ఎవరికీ ఫోన్లు చేయనంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా అధికార భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ ఖర్ ను నిలబెట్టింది.
సోమవారం నుండి తన మొబైల్ నుండి కాల్ లు చేయడం లేదా స్వీకరించడం సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మార్గరెట్ అల్వా.
ప్రభుత్వ యాజమాన్యం లోని టెలికాం ఆపరేటర్ ఎంటీఎన్ఎల్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఏ ఎంపీకి తాను ఫోన్ చేయనని హామీ ఇస్తున్నానని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అల్వా ట్యాంగ్ చేశారు. ప్రియమైన బీఎస్ఎన్ఎల్ , ఎంటీఎన్ఎల్ కు విన్నపం ఇవాళ బీజేపీలని కొంత మంది స్నేహితులతో మాట్లాడిన తర్వాత నా మొబైల్ కి వచ్చిన అన్నీ కాల్స్ మళ్లించ బడుతున్నాయని వాపోయారు.
Also Read : దమ్ముంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం