Arpita Mukharjee : ఆ రూ. 20 కోట్లు నావి కావు మంత్రివే
ఈడీ ముందు అర్జిత వాంగ్మూలం
Arpita Mukharjee : తనకే పాపం తెలియదంటూ చివరి దాకా చెప్పే ప్రయత్నం చేసిన టీఎంసీ పార్టీకి చెందిన మంత్రి పార్థ ఛటర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది.
ఆయన విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన స్కాం కలకలం రేపింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.
ఆయనకు అనుంగు అనుచరురాలిగా పేరొందిన నటి అర్ఫిత ఛటర్జీ(Arpita Mukharjee) ఇంటితో పాటు విద్యా శాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై ఏకకాలంలో దాడులకు పాల్పడింది.
ఊహించని రీతిలో కళ్లు బైర్లు కమ్మేలా అర్పిత ఇంట్లో గుట్టలు గుట్టలుగా పేరుకు పోయిన రూ. 500, రూ. 2,000 నోట్ల కట్టలు బయట పడ్డాయి. బ్యాంకు అధికారులతో వాటిని లెక్కించారు.
ఏకంగా రూ. 20 కోట్లకు పైగా ఉన్నట్లు తేల్చారు. ఆపై 20 విలువైన మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేసింది ఈడీ.
ఈ సందర్బంగా పార్థ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం మమతా బెనర్జీ. తాను తప్పు చేయనని, అవినీతి, అక్రమాలకు పాల్పడనని స్పష్టం చేశారు.
అలా ఎవరైనా చేస్తే తాను మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని అన్నారు. ఈ తరుణంలో కీలక పాత్ర వహించినట్లు భావించిన ఈడీ అర్పిత ఛటర్జీని విచారించింది.
ఈ దర్యాప్తులో ఆమె సంచలన ప్రకటన చేసింది. తన వద్ద పట్టుబడిన సొమ్మంతా తనది కాదని మంత్రి పార్థ ఛటర్జీకి చెందినవేనంటూ చెప్పింది. దీంతో పార్థ ఛటర్జీ బయటకు రాకుండా ఉండడం ఖాయమని తేలింది.
Also Read : నా ఫోన్ ను పునరుద్దరించండి