Rahul Gandhi Arrest : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్ట్

ఈడీ ప్ర‌శ్నిస్తున్న స‌మ‌యంలో నిర‌స‌న

Rahul Gandhi Arrest : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయ‌నాయుడు ఎంపీ రాహుల్ గాంధీని పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అరగంట పాటు వాగ్వాదాం చోటు చేసుకుంది రాహుల్ గాంధీకి పోలీసుల‌కు. చివ‌ర‌కు ఎంపీని అదుపులోకి(Rahul Gandhi Arrest) తీసుకున్నారు.

ఇత‌ర ఎంపీల‌తో పాటు రాహుల్ ను బ‌స్సులోకి ఎక్కించారు. త‌న త‌ల్లి సోనియా గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ప్ర‌శ్నిస్తున్న స‌మ‌యంలో రాహుల్ గాంధీ న‌డిరోడ్డుపై కూర్చున్నారు.

నిర‌స‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించినందుకు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. రాహుల్(Rahul Gandhi Arrest) ను పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. రాజ్ ప‌థ్ లో కూర్చున్నారు.

పార్ల‌మెంట్ , ప్ర‌భుత్వ ఉన్న‌త కార్యాల‌యాల‌కు స‌మ‌పంలో ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దేశంలో పెరుగుతున్న ధ‌ర‌ల పెరుగ‌ద‌ల‌, జీఎస్టీ నుండి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకోవడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్యం లేద‌ని ఇది పోలీసు రాజ్యాన్ని త‌ల‌పిస్తోంద‌న్నారు. ఈ దేశానికి , పోలీసు రాజ్యానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ రాజుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.

రాహుల్ గాంధీ నిర్బంధానికి ముందు ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా ఆయ‌న‌ను అదుపులోకి తీసుకోవాలా వ‌ద్దా అని కొంత సేపు మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు పోలీసులు. అంత‌కు ముందు సోనియా గాంధీతో క‌లిసి రాహుల్ , ప్రియాంక గాంధీ ఈడీ ఆఫీసు వ‌ద్ద‌కు వ‌చ్చారు.

పార్ల‌మెంట్ వ‌ద్ద నిర‌స‌న‌లో పాల్గొనే కంటే ముందు రాహుల్ అక్క‌డికి వెళ్లారు. కాంగ్రెస్ ఎంపీల‌ను స‌స్పెండ్ చేసిన త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కు వెళ్లేందుకు య‌త్నించిన ఎంపీల‌ను విజ‌య్ చౌక్ క్రాసింగ్ వ‌ద్ద అడ్డుకున్నారు.

Also Read : త‌మిళ‌నాడు స్పీక‌ర్ కామెంట్స్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!