Punjab AG : పంజాబ్ అడ్వకేట్ జనరల్ రాజీనామా
అన్మోల్ రతన్ సిద్దూ మార్చిలో నియామకం
Punjab AG : పంజాబ్ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా అన్మోల్ రతన్ సిద్దూ (Punjab AG) నియమించబడ్డారు. ఎందుకనో ఆయన కొంత కాలం పాటు మాత్రమే ఉన్నారు.
మంగళవారం ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సిద్దూ. తాను వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకుంటున్నట్లు వెల్లడించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సీనియర్ న్యాయవాది డీఎస్ పట్వాలియా స్థానంలో కొత్తగా కొలువు తీరిన ఆప్ సర్కార్ అన్మోల్ రతన్ సిద్దూను నియమించింది.
ఇక ఆప్ ప్రభుత్వం కొలువు తీరి నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. ఇప్పటికే ఈ మధ్య కాలంలో ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు నిష్క్రమించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆప్ సర్కార్ వచ్చాక మొదట రాజీనామా చేసిన వ్యక్తం మాజీ పోలీస్ చీఫ్ వికె భావరా. మే 29న పంజాబీ గాయకుడు సిద్దూ మూసే వాలా(Sidhu MooseWala) హత్యకు గ్యాంగ్ స్టర్ కుట్రదారుగా పేరున్న లారెన్స్ బిష్నోయ్ ను ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి తరలించడంలో సిద్దూ కీలక పాత్ర పోషించారు.
రాష్ట్ర పోలీసులకు లారెన్స్ బిష్ణోయ్ కస్టడీ కోసం ఢిల్లీలోని కోర్టు విచారణకు హాజరై పంజాబ్ కు తిరిగి వస్తుండగా తనపై దాడి జరిగిందని అడ్వకేట్ జనరల్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఆప్ సర్కార్ కు కోర్టుల పరంగా ఇబ్బంది ఏర్పడింది. బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా పంజాబ్, హర్యానా కోర్టు నుంచి ఉపశమనం పొందారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాకు బెయిల్ మంజూరైంది.
Also Read : మార్గరెట్ అల్వా ఫోన్ ట్యాపింగ్ అబద్దం