Farooq Abdullah : మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దులాపై ఈడీ కేసు

మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఛార్జిషీట్

Farooq Abdullah : కేంద్ర స‌ర్కార్ ప్ర‌తిపక్షాల‌పై, త‌మ‌ను ప్ర‌శ్నించే వారి గొంతు అణిచే పనిలో ప‌డింది. తాజాగా ప‌శ్చిమ బెంగాల్ మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్ర‌స్తుతం జ‌మ్మూ , కాశ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లాకు(Farooq Abdullah) కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ఈ మేర‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మ‌నీ లాండ‌రింగ్ కేసులో చార్జి షీట్ దాఖ‌లు చేసింది. గ‌త మే 31న శ్రీ‌న‌గ‌ర్ లో ఫ‌రూక్ అబ్దుల్లాను ఈడీ మూడు గంట‌ల‌కు పైగా ప్ర‌శ్నించింది.

జ‌మ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేష‌న్ లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి మ‌నీ లాండ‌రింగ్ కేసులో మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లాపై చార్జిషీట్ దాఖ‌లు చేసింది.

చార్జిషీట్ దాఖ‌లు చేసిన ఈడీ 84 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న అబ్దుల్లాను ప‌లుమార్లు ప్ర‌శ్నించింది. 2019లో ఇదే కేసులో మూడుసార్లు సీఎంగా ఉన్న ఆయ‌న వాంగ్మూలాన్ని కూడా న‌మోదు చేసింది.

డిసెంబ‌ర్ 2020లో రూ. 11.86 కోట్ల విలువైన ఫ‌రూక్ అబ్దుల్లాకు చెందిన ఆస్తుల‌ను కేంద్ర ద‌ర్యాప్తు ఏజెన్సీ అటాచ్ చేసింది. ఈ కేసులో జ‌మ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేష‌న్ కు చెందిన నిధుల‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా మ‌నోడు నొక్కేశాడంటూ ఆరోపించింది ఈడీ.

ఆ నిధుల‌ను అసోసియేష‌న్ ఆఫీస్ బేర‌ర్ల‌తో పాటు వివిధ వ్య‌క్తుల‌కు వ్య‌క్తిగ‌త బ్యాంకు ఖాతాల‌కు బ‌దిలీ చేశార‌ని గుర్తించింది.

ఇదిలా ఉండ‌గా అసోసియేష‌న్ ఆఫీస్ బేర‌ర్ల‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ దాఖ‌లు చేసిన ఛార్జిష‌ట్ ఆధారంగా ఈడీ మ‌నీ లాండ‌రింగ్ ద‌ర్యాప్తు ప్రారంభించింది.

ఫ‌రూక్ అబ్దుల్లా(Farooq Abdullah) అసోసియేష‌న్ చీఫ్ గా త‌న ప‌ద‌విని దుర్వినియోగం చేశార‌ని , బీసీసీఐ ఇచ్చిన నిధుల‌ను కూడా స్వాహా చేశారంటూ ఈడీ ఆరోపించింది.

Also Read : పంజాబ్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!