Derek O Brien : ప్ర‌జాస్వామ్యాన్ని స‌స్పెండ్ చేశారు – టీఎంసీ

ఎంపీలపై స‌స్పెన్ష‌న్ వేటు పై ఎంపీ ఓబ్రియన్

Derek O Brien : పార్ల‌మెంట్ లో ఎంపీలపై వేటు కొన‌సాగుతూనే ఉంది. వ‌ర్షాకాల స‌మావేశాలు ఈనెల 18న ప్రారంభ‌మ‌య్యాయి. లోక్ స‌భ‌లో జీఎస్టీ విధించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ఎంపీలు.

సోమ‌వారం లోక్ స‌భ స్పీక‌ర్ న‌లుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల‌ను స‌స్పెండ్ చేశారు. మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్, టీఎంసీ , టీఆర్ఎస్, డీఎంకే, సీపీఐకి చెందిన 19 మంది రాజ్య‌స‌భ ఎంపీల‌ను వారం రోజుల పాటు స‌భ‌కు అంత‌రాయం క‌లిగించారంటూ స‌స్పెన్ష‌న్ విధించారు డిప్యూటీ చైర్మ‌న్ ప్ర‌క‌టించారు.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియ‌న్. సంచ‌ల‌న కామెంట్స్ చేశారు రాజ్య‌స‌భ వేదిక‌గా. ఎంపీల‌ను స‌స్పెండ్ చేశామ‌ని మీరు ఆనంద ప‌డుతున్నారు.

కానీ భార‌త రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా మీరు వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌జాస్వామ్యాన్ని స‌స్పెండ్ చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, త‌దిత‌ర ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించ‌కుండా ఉండేందుకే ఇలా వేటు వేశారంటూ ఆరోపించారు డెరెక్ ఓబ్రియ‌న్(Derek O Brien). ఇది పూర్తిగా క‌క్ష సాధింపు ధోర‌ణితో తీసుకున్న నిర్ణ‌యంగా ఆయ‌న పేర్కొన్నారు.

ఒకే ఏడాదిలో స‌స్పెన్ష‌న్ కు గురైన ఎంపీల‌లో ఇదే అత్య‌ధిక‌మ‌న్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా క‌లిసి ప్ర‌జాస్వామ‌న్ని ఖూనీ చేశారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ స‌స్పెండ్ అయిన ఎంపీల‌లో ఏడు మంది టీఎంసీకి చెందిన వారే ఉన్నారు. వారిలో సుస్మితా దేవ్ , మౌస‌మ్ నూర్ , డాక్ట‌ర్ శాంతాను సేన్ , డోలా సేన్ , శాంతాను సేన్ , న‌డిమ‌ల్ హ‌క్ , అభి రంజ‌న్ గోస్వామి, శాంత ఛెత్రి ఉన్నారు.

Also Read : ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ‌కు సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!