Delhi Cops Manhandle : ఖాకీల నిర్వాకం కాంగ్రెస్ ఆగ్రహం
కేంద్ర సర్కార్ ఆగని దమనకాండ
Delhi Cops Manhandle : ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా 144 సెక్షన్ విధించారు. ఎక్కడ చూసినా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ శ్రేణులపై ఢిల్లీకి చెందిన ఖాకీలు(Delhi Cops Manhandle) చేయి చేసుకున్నారు.
దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు. మరో వైపు రాహుల్ గాంధీ రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర సర్కార్ రాచరిక పాలన సాగిస్తోందంటూ ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ కు చెందిన యువ నాయకుడు బీవీ శ్రీనివాస్ ను తోసుకుంటూ వెళ్లారు. ఆపై అతడి జుట్టు పట్టుకుని ఈడ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
దీనిని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. ఇది ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నడుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియ చేస్తున్న తమ వారిపై బలవంతంగా దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఫాసిస్టు పాలన సాగిస్తోందని ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలంటూ ప్రశ్నించింది.
యూత్ కాంగ్రెస్ చీఫ్ పై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ పార్టీ. దీనిపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read : ఆరు గంటల విచారణ మళ్లీ సమన్లు