Sonia Gandhi ED : ఈడీ ముందుకు మ‌రోసారి సోనియా గాంధీ

మూడో రోజు హాజ‌రు కావాల‌ని స‌మ‌న్లు

Sonia Gandhi ED : నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రికకు సంబంధించిన మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ మూడో రోజు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ ) ముందు హాజ‌రు కానున్నారు.

క‌రోనా కార‌ణంగా హాజ‌రు కాలేక పోయిన సోనియా ఇప్ప‌టి వ‌రకు రెండుసార్లు ఈడీ వ‌ద్ద‌కు వెళ్లారు. మొద‌టి రోజు ఈడీ రెండు గంట‌ల‌కు పైగా విచారించింది. రెండో రోజు జూలై 26న ఆరు గంట‌ల‌కు పైగా సోనియా గాంధీని విమెన్ ఆఫీస‌ర్స్ ప్ర‌శ్నించారు.

మ‌రోసారి హాజ‌రు కావాల్సిందిగా స‌మ‌న్లు జారీ చేసింది ఈడీ. దీనిని నిర‌సిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా శాంతియుతంగా నిర‌స‌న తెలిపింది. కానీ దేశ రాజ‌ధానిలో పెద్ద ఎత్తున ఆందోళ‌న ఉధృతంగా మారింది.

ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ వీబీ శ్రీ‌నివాస్ త‌ల‌ను ప‌ట్టుకుని కారులో ఈడ్చి కొట్ట‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. దీనిపై రాద్దాంతం చోటు చేసుకుంది.

ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆందోళ‌న‌లు మిన్నంటాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది ఈ స‌న్నివేశం. దీంతో ఢిల్లీ పోలీసులు దాడికి పాల్ప‌డిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

ఇది ప‌క్క‌న పెడితే సోనియా గాంధీ జూలై 27న హాజ‌రవుతారు. జూలై 26న రాత్రి 7 గంట‌ల ప్రాంతంలో త‌న ఇంటికి వెళ్లి పోయారు.

74 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన సోనియా గాంధీని(Sonia Gandhi ED) ఇంటి వ‌ద్ద విచారించేందుకు వీలున్నా కావాల‌ని ఈడీ ఇలా చేస్తోందంటూ శివ‌సేన‌, విప‌క్షాలు మండిప‌డ్డాయి. మ‌రో వైపు కేంద్ర స‌ర్కార్ క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ.

Also Read : ఆరు గంట‌ల విచార‌ణ మ‌ళ్లీ స‌మ‌న్లు

Leave A Reply

Your Email Id will not be published!