Sanjay Raut : సోనియా పట్ల కక్ష సాధింపు తగదు – రౌత్
కేంద్ర సర్కార్ పై శివసేన ఎంపీ ఫైర్
Sanjay Raut : కేంద్ర సర్కార్ కక్ష సాధింపు ధోరణిని అవలంభిస్తోందని ఆరోపించారు శివసేన జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని ప్రశ్నిస్తోంది.
ఇవాళ మూడో రోజు. గతంలో తనయుడు రాహుల్ గాంధీని ఇదే కేసుకు సంబంధంచి ఐదు రోజులు వరుసగా ప్రశ్నించింది. ప్రతి రోజూ విచారణ 10 నుంచి 12 గంటల దాకా సాగింది.
కానీ ఎక్కడా తగ్గలేదు రాహుల్ గాంధీ. ఈ తరుణంలో కరోనా సోకడంతో ఆస్పత్రి పాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనియా గాంధీకి ఈడీ సమన్లు పంపించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut).
వయస్సు మళ్లిన వారి పట్ల దయతో ఉండాలని, వారి ఇంటి వద్దకు వెళ్లి కూడా విచారించేందుకు వీలుంటుందని ఆ విషయాన్ని కేసుల విషయంలో ఉందని స్పష్టం చేశారు ఎంపీ.
కానీ ఇదెక్కడా ఈడీ అమలు చేయడం లేదని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే సంజయ్ రౌత్ ను సైతం ఈడీ ప్రశ్నించింది. ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
రౌత్ కుటుంబానికి చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. తాను ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని కేవలం కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వారిని, నిలదీస్తున్న వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందంటూ ఆరోపించారు సంజయ్ రౌత్(Sanjay Raut).
74 ఏళ్ల వయస్సు ఉన్న సోనియా గాంధీ పట్ల కేంద్రం , ఈడీ అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : ఈడీ ముందుకు మరోసారి సోనియా గాంధీ