Donald Trump : తగ్గేదే లే అంటున్న డొనాల్డ్ ట్రంప్
వచ్చే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Donald Trump : ఇటీవలే తను ప్రేమించిన భార్య చని పోయింది. కానీ ఆ బాధను దిగమింగుకుని మళ్లీ కొత్త ఉత్తేజంతో దూసుకు వచ్చాడు అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).
2024లో జరిగే ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కాగా తాను బరిలో ఉంటానా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
తదుపరి రిపబ్లికన్ అధ్యక్షుడి ప్రాధాన్యత ఎలా ఉండాలనే దానిపై తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. 2020 ఎన్నికల్లో తాను గెలుపొందానని పేర్కొనడం విశేషం.
18 నెలల కిందట వైట్ హౌస్ నుండి నిష్క్రమించిన ట్రంప్ మళ్లీ వాషింగ్టన్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను ఎప్పుడూ మొదటిసారి పోటీ చేసి గెలిచాను.
రెండో సారి పటీ చేశాను. మెరుగ్గా ప్రయత్నం చేశానని చెప్పారు ట్రంప్. మరోసారి శ్రమించాల్సి ఉంది. మన దేశాన్ని మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
మరికొన్ని రోజుల్లో మీకు ఓ శుభవార్త చెబుతానంటూ చావు కబరు చల్లగా చెప్పారు. అమెరికా ఫస్ట్ పాలసీ ఇనిస్టిట్యూట్ లో వేదికపైకి వచ్చే కంటే ముందు మాజీ ప్రెసిడెంట్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అమెరికాలో.
వాషింగ్టన్ లో జరిగిన యంగ్ అమెరికా ఫౌండేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు డొనాల్డ్ ట్రంప్(Donald Trump). అమెరికన్లు గతాన్ని కాకుండా భవిష్యత్తును చూడాలని , ట్రంప్ తో విభేదాలను తగ్గించు కోవాలని సూచించారు పెన్స్.
ఇక 90 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగించారు. అక్రమ వలసలు, నేరాలతో సహా 2016 విజయవంతమైన ప్రచారం, అనేక అంశాలను ప్రస్తావించారు.
Also Read : మొదటి రోజు రూ. 1.45 లక్షల కోట్లు