YS Jagan : ముంపు బాధితులకు జగన్ భోరోసా
అన్నీ తానైన ఆంధ్రప్రదేశ్ సీఎం
YS Jagan : వరద తీవ్రతకు గురైన ప్రాంతాలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఇవాళ రెండో రోజు కూడా పర్యటించారు. ముంపు బాధితులకు భరోసా కల్పించారు.
తాను వస్తే అధికారులకు ఇబ్బంది అవుతుందని అందుకే కొంచెం ఆలస్యమైందన్నారు. కానీ ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా చూస్తానని చెప్పారు. నీళ్లల్లోనే నడుచుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించే ప్రయత్నం చేశారు జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
బాధితులతో పాటు పశువులకు కూడా మేలు చేకూరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. బాధితులకు సాయం అందిందో లేదో తానే చెక్ చేస్తానని అన్నారు.
పంటలు, పశువులు, ఇళ్లు కోల్పోయిన వారందరికీ నష్ట పరిహారం 15 రోజుల్లో అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులు చేసిన కృషి బాగుందని కితాబు ఇచ్చారు జగన్ రెడ్డి(YS Jagan).
కలెక్టర్ హిమాన్షు శుక్లాను ప్రత్యేకంగా అభినందించారు. పి. గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద ముంపులకు గురైన గంటి పెదపూడిలంక, అరిగెలవారిపాలెం, ఊడుమూడిలంక, బూరుగులంక, నున్నవారి బాడవ, మేకలపాలం గ్రామాల్లో పర్యటించి బాధితులను కలిశారు సీఎం.
సాయం అందుకున్నారా లేదా అని ఆరా తీశారు జగన్ రెడ్డి. బాధితులైన ప్రతి ఒక్కరికి సాయం అందించేంత వరకు తాను నిద్రో పోయే ప్రసక్తి లేదన్నారు.
ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీజన్ ముగియకుండానే సాయం అందజేస్తామని చెప్పారు సీఎం. గంటి పెదపూడి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
బాధితులను పరామర్శించిన అనంతరం రాజమండ్రిలో సమీక్ష చేపట్టారు సీఎం.
Also Read : వరద బాధితులకు జగన్ రెడ్డి భరోసా