BJP Worker Murder : బీజేపీ కార్యకర్త హత్య కర్ణాటకలో ఉద్రిక్తత
మిన్నంటిన నిరసనలు..ఆందోళనలు
BJP Worker Murder : కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో గత రాత్రి స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యకర్తను దారుణంగా నరికి(BJP Worker Murder) చంపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దారుణ హత్యకు గురైన వ్యక్తి బీజేపీ యువజన విభాగం సభ్యుడు ప్రవీణ్ నెట్టారు గా గుర్తించారు.
జూలై 26న రాత్రి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు దారి కాచి దాడికి పాల్పడ్డారు. దారుణంగా కొట్టి చంపారు. ప్రవీణ్ కు 32 ఏళ్లు. దీంతో పెద్ద ఎత్తున బీజేపీ, కాషాయ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.
మృతుడు పౌల్ట్రీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. తన షాప్ ను మూసి వేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హంతకులు హతుడిని వదిలి వేయడంతో పోలీసులకు సమాచారం అందింది.
తీవ్ర గాయాలతో ఉన్న ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చని పోయినట్లు ప్రకటించారు. ఈ దారుణ హత్యతో నిరసనలు మిన్నంటాయి. బెల్లారి, తదితర ప్రాంతాలలో ఆందోళనలు చేపట్టారు.
హత్యను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ బంద్ కు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం ప్రవీణ్ మృత దేహాన్ని ఇంటికి తీసుకు వెళుతుండగా పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.
నెట్టారు హత్య వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉందంటూ కొన్ని మితవాద సంస్థలు ఆరోపించాయి.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బహిరంగ సభలపై ఆంక్షలు విధించినట్లు జిల్లా పోలీస్ చీఫ్ రుషి కేష్ సోనాయ్ తెలిపారు. ముగ్గురు దుండగులు వచ్చరాని , కేరళ రిజిస్ట్రేషన్ నంబరు ఉందన్నారు. సీఎం బొమ్మై ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
Also Read : ఎయిర్ పోర్ట్ లో బిషప్ కు బిగ్ షాక్