Arpita Mukherjee : ఇంటిని మినీ బ్యాంక్ గా వాడుకున్నారు
అర్పితా ముఖర్జీ సంచలన కామెంట్స్
Arpita Mukherjee : పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న టీచర్ల స్కాంకు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన మంత్రి పార్థ సారథి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తనకు రైట్ హ్యాండ్ గా భావించిన నటిగా పేరొందిన అర్పితా ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకుంది ఈడీ. ఈ మేరకు దర్యాప్తు లో భాగంగా సంచలన విజయాలు వెలుగు చూశాయి.
ఈడీ దాడి చేసిన సమయంలో అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) ఇంట్లో ఏకంగా కళ్లు చెదిరే నోట్ల కట్టలు బయట పడ్డాయి. రూ. 20 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఇందులో డబ్బులతో పాటు 20 ఖరీదైన మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి పార్థ ఛటర్జీతో పాటు విద్యా శాఖ సహాయ మంత్రి, మరో ఎమ్మెల్యే ఇళ్లపై ఈడీ దాడులకు పాల్పడింది. ఇదే సమయంలో ఆ దొరికిన డబ్బంతా తనది కాదని మంత్రి పార్థ ఛటర్జీదేనని కుండ బద్దలు కొట్టింది.
తాజాగా మరో బాంబు పేల్చింది అర్పితా ముఖర్జీ. మంత్రి తన ఇంటిని మినీ బ్యాంక్ గా మార్చుకున్నారంటూ ఈడీ ఆఫీసర్లకు తెలిపినట్లు సమాచారం.
మరి మీకు మంత్రికి ఉన్న మధ్య సంబంధం ఏంటి అన్న ప్రశ్నకకు బెంగాలీ నటుడి ద్వారా పార్థ ఛటర్జీ తనకు పరిచయం అయ్యారని తెలిపారు. మంత్రి ప్రతి వారం లేదా ప్రతి 10 రోజులకు ఒకసారి తన ఇంటికి వచ్చే వారని స్పష్టం చేసినట్లు ఈడీ పేర్కొంది.
ఆ ఇతర మహిళ కూడా తనకు సన్నిహితురాలిగా పేర్కొనడం విశేషం. 2016 నుంచి వారిద్దరూ సన్నిహితంగా ఉన్నట్లు తనకు తెలుసుని పేర్కొంది. అయితే విచారణ విషయాలను ఈడీ ఎలా బయటకు వెల్లడిస్తుందంటున్నారు ప్రతిపక్షాలు.
Also Read : క్యాసినో వ్యవహారం ఈడీ దాడుల కలకలం