Mithun Chakraborty : ట‌చ్ లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు

బాంబు పేల్చిన మిథున్ చ‌క్ర‌వ‌ర్తి

Mithun Chakraborty : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ప్ర‌స్తుతానికి ప‌శ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు త‌మతో ట‌చ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు.

బుధ‌వారం ఆయ‌న కోల్ క‌తాలో జాతీయ మీడియా ఏఎన్ఐ తో మాట్లాడారు. వారంతా త‌మతో రోజూ మాట్లాడుతూనే ఉన్నార‌ని చెప్పారు. ఈ 38 మంది ఎమ్మెల్యేల‌లో 21 మంది ఎమ్మెల్యేలు ప్ర‌త్య‌క్ష సంబంధాలు క‌లిగి ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

మీకు బ్రేకింగ్ న్యూస్ కావాల‌ని అనుకుంటున్నారా. ఇదిగో అని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం మిథున్ చ‌క్ర‌వ‌ర్తి చేసిన ఈ షాకింగ్స్ కామెంట్స్ టీఎంసీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఇప్ప‌టికే భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన దీదీ నేతృత్వంలోని టీఎంసీ ప్ర‌భుత్వానికి సంబంధించిన కీల‌క మంత్రిని మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది.

ఇదే స‌మ‌యంలో మ‌రో విద్యా శాఖ స‌హాయ మంత్రితో పాటు ఎమ్మెల్యేపై దాడులు చేసింది. సోదాలు నిర్వ‌హించింది. మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీకి చెందిన స‌హాయ‌కురాలు, న‌టి ఆర్షిత ఛ‌ట‌ర్జీ ఇంట్లో ఏకంగా రూ. 21 కోట్ల‌కు పైగా న‌గ‌దు ప‌ట్టుబ‌డింది.

20 ఖ‌రీదైన మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకుంది ఈడీ. ఈ త‌రుణంలో ఇటీవ‌లే మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌, కాంగ్రెస్ , ఎన్సీపీతో కూడిన మ‌హా వికాస్ అఘాడీ సంకీర్ణ స‌ర్కార్ ను కూల‌దోసింది కేంద్ర స‌ర్కార్.

ఆ త‌ర్వాత త‌మ ప‌ని మిగిలింది ఛ‌త్తీస్ గ‌ఢ్ , ఝార్ఖండ్, ప‌శ్చిమ బెంగాల్ అని ప్ర‌క‌టించింది. ఈ త‌రుణంలో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి(Mithun Chakraborty) చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం విశేషం. దీనిపై ఇంకా టీఎంసీ ప్ర‌తినిధులు నోరు మెదప‌లేదు.

Also Read : ర‌త‌న్ టాటా ఆశీర్వాదం షిండే సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!