ED Raids : ‘అర్పితా’ మ‌రో ఫ్లాట్ లో రూ. 21.9 కోట్లు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ దాడి

ED Raids : ప‌శ్చిమ బెంగాల్ లో టీచ‌ర్ రిక్రూట్ మెంట్ స్కాంపై విచార‌ణ జ‌రుపుతున్న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బుధ‌వారం దాడులు(ED Raids) చేప‌ట్టింది.

మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీకి చెందిన స‌న్నిహితురాలిగా భావిస్తున్న న‌టి అర్పితా ముఖ‌ర్జీ మ‌రో ఫ్లాట్ లో సోదాలు చేప‌ట్టింది. మొన్న చేప‌ట్టిన దాడుల్లో రూ. 21 కోట్ల న‌గ‌దు దొర‌క‌గా ఇవాళ జ‌రిపిన దాడుల్లో క‌నీసం రూ.21.9 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు ప‌ట్టుబ‌డింది.

ఈ స్కాంలో ఇప్ప‌టికే మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీని అరెస్ట్ చేసింది ఈడీ. ఆ డ‌బ్బు త‌న‌ది కాద‌ని మంత్రి పార్థ దేన‌ని చెప్పింది అర్పితా ముఖ‌ర్జీ. ఇదే స‌మ‌యంలో ఆమెకు సంబంధించిన ప‌లు ఇళ్ల‌ల్లో ఇవాళ విస్తృతంగా సోదాలు నిర్వ‌హించింది ఈడీ(ED Raids).

క‌ళ్లు చెదిరేలా మ‌రికొంత న‌గ‌దు బ‌య‌ట ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అర్పితా ముఖ‌ర్జీ ఇళ్ల‌లో రూ. 42.9 కోట్ల మేర ల‌భించిన‌ట్ల‌యింది. ఈ మొత్తం న‌గ‌దును లెక్కించేందుకు ఈడీ అధికారులు బ్యాంకు అధికారుల స‌హ‌కారాన్ని తీసుకోవాల్సి వ‌చ్చింది.

ఇదిలా ఉంగా నిందితురాలిగా ఉన్న అర్పితా ముఖ‌ర్జీని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం కోల్ క‌తా లోని ఇఎస్ఐ ఆస్ప‌త్రికి తీసుకు వ‌చ్చారు. బెల్గారియాలో ఉన్న ఫ్లాట్ లో భారీగా క‌రెన్సీ నోట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

న‌గ‌రంలోని ఫ్లాట్ లో తాళం చెవ్విలు అందుబాటు లేక పోవ‌డంతో కొంత సేపు వేచి ఉండాల్సి వ‌చ్చింది.

Also Read : ‘అర్పిత’ ఫ్లాట్ లో రూ. 29 కోట్లు..5 కేజీల బంగారం

Leave A Reply

Your Email Id will not be published!