AP DGP : ఏపీలో సైబ‌ర్ నేరాల‌పై ఫోక‌స్

డేటా అన‌లిటిక‌ల్ సెంట‌ర్ ఏర్పాటు

AP DGP : రాష్ట్రంలో నేరాల నియంత్ర‌ణ కోసం ప్ర‌త్యేకంగా డేటా ఎన‌లిటిక్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు రాష్ట్ర పోలీస్ శాఖ ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

సైబ‌ర్ నేరాలను గుర్తించేందుకు వీలు క‌ల్పించే సైబ‌ర్ డేటా అన‌లిటిక‌ల్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌నుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పోలీసులంద‌రికీ సైబ‌ర్ నేరాల అదుపు, గుర్తింపు పై ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌నుంది.

ఇటీవ‌ల సైబ‌ర్ నేరాలు మ‌రింత పెరిగాయి. వాటిని మొగ్గ‌లోనే తుంచి వేసేందుకు రాష్ట్ర డీజీపీ (AP DGP) చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సైబ‌ర్ నేరాల గురించిన ఫిర్యాదులు పోలీస్ స్టేష‌న్ ల‌లో న‌మోద‌వుతున్నాయి.

జాతీయ స్థాయిలో సైబ‌ర్ నేర‌స్తుల వివ‌రాల‌తో కూడిన ఆధునిక డేటా అన‌లిటిక‌ల్ సెంట‌ర్ ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్ర పోలీస్ ప్ర‌ధాన ఆఫీసులో దీనిని ఏర్పాటు చేయ‌నున్నారు. సైబ‌ర్ నేరాల‌కు సంబంధించి ఇది స‌హాయం చేస్తుంది. ఇందుకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాల‌లో నెల‌కొల్పిన డేటా సెంట‌ర్ల‌ను పోలీసు ఉన్న‌తాధికారులు ప‌రిశీలించారు.

ఆ మేర‌కు ఇక్క‌డ మ‌రింత అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ట్రైనింగ్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే సీఎం డీజీపీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అంతే కాకుండా ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల‌తో దీనిని అనుసంధానం చేశారు.

ఏపీలోని వివిధ జిల్లాల్లో సైబ‌ర్ నేరాల ప‌రిశోధ‌న‌కు గాను సైబ‌ర్ సెల్స్ ను ఏర్పాటు చేశారు. అర్హ‌త క‌లిగిన ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్ల‌ను నియ‌మించారు. జిల్లాకు ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్ఐ ల‌తో కూడిన రిసోర్స్ ప‌ర్స‌న్ల బృందాల‌ను ఎంపిక చేశారు.

Also Read : జ‌గ‌న్ ఆవేద‌న మోదీకి అర్థ‌మ‌య్యేనా

Leave A Reply

Your Email Id will not be published!