Shiv Sena Om Birla : లోక్ స‌భ స్పీక‌ర్ పై కోర్టులో పిటిష‌న్

స‌భా నియ‌మాల‌కు తిలోద‌కాలు

Shiv Sena Om Birla : మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన వ‌ర్సెస్ ఏక్ నాథ్ షిండే వ‌ర్గాల మ‌ధ్య ఇంకా పోరు కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రోసారి శివ‌సేన పార్టీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది త‌మ‌పై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన వారిపై.

ఇక లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను టార్గెట్ చేసింది. ఆయ‌న స‌హ‌జ న్యాయానికి సంబంధించిన ప్రాథ‌మిక నిబంధ‌న‌లు పాటించ‌డం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

నిర్ధిష్ట‌మైన అభ్య‌ర్థ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ త‌మ పార్టీకి సంబంధించిన అభ్య‌ర్థుల వివ‌ర‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని ఆరోపించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ మౌలిక సూత్రాల‌కు భిన్న‌మైన‌ద‌ని, వ్య‌తిరేక‌మైన‌ద‌ని పేర్కొంది.

త‌మ ఎంపీల‌ను లోక్ స‌భ ప‌ద‌వుల నుంచి తొల‌గించ‌డంపై లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాపై(Shiv Sena Om Birla) ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన వ‌ర్గం మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం క‌ల‌క‌ల రేపింది.

లోక్ స‌భ‌లో శివ‌సేన పార్టీకి నాయ‌కుడిగా రాహుల్ షెవాలేతో స‌హా ఏక్ నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన వారిని తిరిగి నియ‌మించాల‌ని , వాటిని ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్ లో కోరారు.

పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన ఎంపీఎస్ సూచ‌న‌ల మేర‌కే ఈ నియామ‌కాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. పార్టీ చీఫ్ విప్ గా ఉన్న భావ‌నా గ‌వాలిని కూడా తొలగించాల‌ని సూచించారు దాఖ‌లు చేసిన పిటిష‌న్ లో.

ఇలా చేయ‌డం ద్వారా స్పీక‌ర్ పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించార‌ని ఎంపీలు వినియాక్ రౌత్ , రాజ‌న్ విచారే దాఖ‌లు చేసిన పిటిష‌న్ లో పేర్కొన్నారు.

Also Read : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ వార్షికోత్స‌వ వేడుక‌లు ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!