ED Raids : ‘అర్పిత’ ఫ్లాట్ లో రూ. 29 కోట్లు..5 కేజీల బంగారం

రెండో రోజూ ఈడీ సోదాల‌లో క‌ళ్లు చెదిరే డ‌బ్బు

ED Raids : ప‌శ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ ప్ర‌భుత్వానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది కేంద్రం. ఇప్ప‌టికే రాష్ట్ర మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీని అరెస్ట్ చేసింది.

ఆయ‌న‌కు అనుంగు అనుచ‌రురాలిగా పేరొందిన న‌టి అర్పిత ముఖ‌ర్జి ఇళ్ల‌లో ఏక కాలంలో దాడులు(ED Raids) చేసింది. ఆమెతో పాటు రాష్ట్ర విద్యా శాఖ స‌హాయ మంత్రి, మ‌రో ఎమ్మెల్యే ఇళ్ల‌పై సోదాలు చేప‌ట్టింది.

మొద‌టి రోజు జ‌రిపిన దాడిలో అర్పిత ముఖ‌ర్జీ ఇంట్లో రూ. 21 కోట్ల న‌గ‌దు, 20 ఖ‌రీదైన మొబైల్స్ స్వాధీనం చేసుకుంది ఈడీ. అనంత‌రం మంత్రిని అరెస్ట్ చేసింది. ఎయిమ్స్ కి త‌ర‌లించింది.

తాజాగా అర్పిత ముఖ‌ర్జీకి చెందిన మ‌రికొన్ని ఇళ్ల‌ల్లో దాడులు చేప‌ట్టింది. బైర్లు క‌మ్మేలా నోట్ల క‌ట్ట‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా బ‌య‌ట ప‌డుతున్నాయి.

అక్ర‌మంగా సంపాదించిన ఈ నోట్ల క‌ట్ట‌ల‌ను లెక్క క‌ట్టేందుకు బ్యాంకు అధికారుల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది ఈడీ . జూలై 27న అర్పిత ముఖ‌ర్జీకి చెందిన ఫ్లాట్ లో సోదాలు జ‌రుప‌గా ఏకంగా రూ. 29 కోట్ల న‌గ‌దు , 5 కిలోల బంగారం దొరికింది(ED Raids).

ఈ మొత్తాన్ని రిక‌వ‌రీ చేసింది ఈడీ. మొన్న దొరికిన రూ. 21 కోట్లు, 20 మొబైల్స్ , నిన్న దొరికిన రూ. 29 కోట్లు క‌లిపితే దాదాపు రూ. 50 కోట్ల న‌గ‌దు , 5 కేజీల బంగారం మామూలు విష‌యం కాదు.

ఇక ఈ కేసుకు సంబంధించి అర్పిత ముఖ‌ర్జీని జూలై 23న ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆమెకు వైద్య ప‌రీక్ష‌లు చేప‌ట్టింది. ఇక దొరికిన డ‌బ్బుల‌ను లెక్కించేందుకు మూడు యంత్రాల‌ను వినియోగించారు.

Also Read : ఎంపీల 50 గంట‌ల నిర‌వ‌ధిక నిర‌స‌న

Leave A Reply

Your Email Id will not be published!