CM Bommai : కర్ణాటక ప్రభుత్వ వార్షికోత్సవ వేడుకలు రద్దు
బీజేపీ యువ నాయకుడు హత్యోదంతం
CM Bommai : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించ తలపెట్టిన వార్షికోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కర్ణాటకలో వరుసగా హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. తమ పార్టీకి చెందిన యువజన నాయకుడు ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు.
గతంలో శివ మొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష కూడా ఇదే రీతిన చని పోయాడు. కొద్ది నెలల వ్యవధిలోనే తమ పార్టీ శ్రేణులకు చెందిన వారిని కోల్పోవడం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు సీఎం బొమ్మై(CM Bommai).
తమ కార్యకర్తలకు నివాళిగా ఈ కార్యక్రమాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆయన బుధవారం అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. విధాన సభలో నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.
అంతే కాకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కావాల్సిన దొడ్డబల్లాపూర్ లో జనోత్సవ మెగా ర్యాలీని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం బొమ్మై.
దేశ వ్యతిరేక, ఉగ్రవాద శక్తులను నిర్మూలించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమాండో దళాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియ చేస్తామన్నారు బొమ్మై.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేశాం. కానీ మా పార్టీకి చెందిన వారు లేకుండా ఉత్సవాలు జరపడం న్యాయం కాదని అనిపించిందన్నారు.
Also Read : రిజర్వేషన్లపై పంచమసాలీలు డిమాండ్