Owaisi : వాళ్లపై పూలు మాపై బుల్డోజర్లు – ఓవైసీ
యూపీ సర్కార్ తీరుపై షాకింగ్ కామెంట్స్
Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
సదరు సర్కార్ ప్రజలకు చెందిన ధనాన్ని ఉపయోగించి కన్వరియాలపై పూల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు. అయితే అందరినీ సమానంగా చూడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
కానీ వాళ్లపై పూల వర్షం కురిపిస్తున్నారు సరే కానీ ముస్లింలు ఏం పాపం చేశారని వాళ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తున్నారంటూ ఓవైసీ ప్రశ్నించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదన్నారు.
ఏదైనా ఉంటే చట్టం ఉంటుందని , కానీ దానిని చేతుల్లోకి తీసుకోవడం మంచి పద్దతి కాదని సూచించారు. వ్యక్తిగత కక్షలు, సాధింపు ధోరణలు మనజాలవని పేర్కొన్నారు ఎంఐఎం చీఫ్.
ప్రతి దానికీ ఓ ప్రొసీజర్ (పద్దతి) అంటూ ఉంటుంది. కానీ యూపీ సర్కార్ దానిని పాటించడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ న్యాయపరమైన హక్కును పొందేందుకు వీలుంటుందని, దానిని గుర్తించక పోతే ఎలా అని ప్రశ్నించారు ఓవైసీ(Owaisi) .
యూపీ సర్కార్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడ, వివక్షా పూరితమైన నిర్ణయాల వల్ల మిగతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అన్నాక అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాలని సూచించారు. ఇదే అసలైన ప్రజాస్వామ్యమని గుర్తుంచు కోవాలన్నారు. కాగా ప్రస్తుతం ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read : పార్టీకి..ప్రభుత్వానికి మాయని మచ్చ – టీఎంసీ
Delhi | BJP-led UP government showering flower petals on Kanwariyas using public money. We want them to treat everyone equally. They don't shower flowers on us (Muslims) instead, they bulldoze our houses: AIMIM MP, Asaduddin Owaisi pic.twitter.com/pdnyhDAStC
— ANI (@ANI) July 27, 2022